తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండవ విడతలోనూ టీఆర్‌ఎస్ తన సత్తా చాటుతోంది. దాదాపు 643 పంచాయతీల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందగా 46 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. జిల్లాల వారీగా కూడా టీఆర్‌ఎస్ ముందంజలో నిలిచింది.