panchayat election results
-
బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం: ఫడణవీస్
ముంబై: మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని అధికార బీజేపీ-శివసేన, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ప్రకటించుకున్నాయి. మొత్తం 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తాము 259 చోట్ల గెలిచామని బీజేపీ చెబుతోంది. అలాగే తమ మిత్రపక్షం, సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన బలపర్చిన 40 అభ్యర్థులు గెలిచినట్లు పేర్కొంది. ఈ ఫలితాలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీనే నెంబర్-1 పార్టీ అన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పని అయిపోయిందన్నారు. బాలాసాబెహ్ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ సమయంలో షిండే పక్కనే ఉన్నారు. అయితే మహావికాస్ అఘాడీ మాత్రం బీజేపీ ప్రకటనను తోసిపుచ్చింది. 494 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చాయని, అందులో తామే ఎక్కువ చోట్ల గెలిచినట్లు లెక్కలు చెప్పింది. వీటి ప్రకారం బీజేపీ 144 స్థానాల్లో, ఎన్సీపీ 126, కాంగ్రెస్ 62, షిండే-శివసేన 41, థాక్రే-శివసేన 37 సీట్లు గెలుపొందింది. దీంతో మొత్తంగా తాము 494కి 225 స్థానాలు గెలిచినట్లు ఎంవీఏ వివరించింది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి వీటిని రాజకీయ పార్టీలు తమ విజయంగా చెప్పుకోవడం సరికాదని ఎన్పీపీ నేత అజిత్ పవార్ అన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు తాము ఈ పార్టీకే మద్దతిస్తామని చెబితే అప్పుడు లెక్కలోకి తీసుకోవచ్చన్నారు. 300 స్థానాల్లో గెలిచామని బీజేపీ-షిండే వర్గం చెబుతోందని ప్రశ్నించగా.. అలా అయితే నేను 400 స్థానాల్లో గెలిచామని చెబుతా అని బదులిచ్చారు. ఇవి పార్టీల గుర్తుపై జరిగే ఎన్నికలు కావు కాబట్టి లెక్కలు ఎంతైనా చెప్పుకోవచ్చని బీజేపీపై సెటైర్లు వేశారు. చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు! -
Kuppam: ప్రజల మద్దతు ఫలితమే కుప్పంలో ఘన విజయం: పెద్దిరెడ్డి
-
టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించు బాబూ!
సాక్షి, అమరావతి: టీడీపీని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి, చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు ఛీత్కరించడంతో టీడీపీ శాశ్వతంగా భూస్థాపితమైందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. టీడీపీ చంద్రబాబు సొంత పార్టీ కాదని, ఎన్టీఆర్ స్థాపిస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రాణాలు పోవటానికి కారణమైన వ్యక్తి.. ఇప్పుడు పార్టీని కూడా అసమర్థతతో నాశనం చేశాడని విమర్శించారు. ‘ఇప్పటికే చంద్రబాబుకు 72 ఏళ్లు వచ్చాయి. తక్షణమే కుప్పం ఫలితాలతోనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, తనయుడు లోకేశ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కుప్పం మునిసిపల్ కౌంటింగ్‌ను స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రికార్డు చేయాలంటూ హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, తీరా ఫలితాలను చూసి వైఎస్సార్సీపీ మ్యానిప్యులేట్ చేసిందంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు ఇక కుప్పంలో పోటీ చేస్తాడనుకోవడం లేదు వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చూసిన చంద్రబాబు తన కొడుకు లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని మదనపడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పంలో ఓటమి భయంతోనే పోలింగ్‌కు ముందు తమను దుర్భాషలాడారన్నారు. ‘లోకేశ్ అయితే పెద్దిరెడ్డి గాడు అని మాట్లాడారు. మా నాన్న చాలా సాఫ్ట్. నేను పెద్ద రౌడీని’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రౌడీలు కాబట్టే కుప్పంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో వారిని ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారన్నారు. మరోసారి చంద్రబాబు, లోకేశ్, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడితే తగిన విధంగా స్పందిస్తానంటూ మంత్రి హెచ్చరించారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ ఓటమితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవటం లేదన్నారు. తనను టార్గెట్ చేస్తూ పుంగనూరులో పోటీ చేయాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు. తామెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టే చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారన్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడు చంద్రబాబు తనకు సీనియర్ అని, తాము వేర్వేరు గ్రూపులకు నాయకులుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే తాను యూనివర్సిటీకి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయ్యానని, అప్పుడు పోటీ ఎందుకు పెట్టలేదో చంద్రబాబునే అడగాలని పెద్దిరెడ్డి చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ నేతలకు సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అభినందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. -
చంద్రబాబు రాజకీయ జీవితానికి పులిస్టాప్ ..?
-
నెల్లూరులో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
AP Municipal Elections 2021 Results Live Updates: 04: 57PM ► కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 31 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-17, టీడీపీ-14 వార్డుల్లో విజయం సాధించాయి. 04: 20PM ► జగ్గయ్యపేట మున్పిపాలిటీని కైవసం చేసుకునే దిశంగా వైఎస్సార్సీపీ ► రెండో రౌండ్లో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ► ఇప్పటికే 8 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్సీపీ ► కాకినాడలో ఉప ఎన్నిక జరిగిన 4 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ► కాకినాడలోని 3, 9, 16, 30వ డివిజన్లలో వైస్సార్సీపీ గెలుపొందింది. 03: 54PM ► రాజంపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇండిపెండెంట్-1 వార్డులో విజయం సాధించాయి. ► గురజాల నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ 16, టీడీపీ-3, జనసేన-1 వార్డులో విజయం సాధించాయి. ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-12, టీడీపీ-4, జనసేన-3 వార్డుల్లో విజయం సాధించాయి. 03:32PM కృష్ణా: కొండపల్లిలో ముగిసిన కౌంటింగ్ ► కొండపల్లిలో 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ-14 స్థానాల్లో విజయం, టీడీపీ- 14 స్థానాల్లో విజయం, ఇండిపెండెంట్-1 స్థానంలో గెలుపు 03:15PM ► నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ ► నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ప్లాప్ షో ► బొక్కబోర్లాపడ్డ సైకిల్ ► 54కి గాను 54 డివిజిన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ►ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్సీపీ ►క్లీన్ స్వీప్‌తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ 02:29PM విశాఖపట్నం: జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బీపిన్ కుమార్ జైన్ విజయం సాధించారు. జీవిఎంసీలో 61వ డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం ► 2028 ఓట్ల మెజార్టీతో కొణతాల సుధ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. కృష్ణాజిల్లా: ► కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగిరాము గెలుపొందారు. ► 26వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గుంజా శ్రీనివాసు విజయం సాధించారు. ► కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి మండే చంద్రశేఖర్ బాబు గెలుపొందారు. 01:40PM కుప్పం గెలుపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్ 01:36PM మొదటి రౌండ్లోనే కుప్పం మున్సిపల్ ఫలితం రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోయింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకున్నారు. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 01:00PM నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 12:50PM ►నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ►నెల్లూరు కార్పొరేషన్ 27 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►ఇప్పటి వరకు 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ ►కుప్పం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్సీపీ గెలుపు 12:40PM ►నెల్లూరు కార్పొరేషన్ 7 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం ►14,27,28,33,39,41,53 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు ►మరో 32 డివిజన్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం 12:15PM ►కుప్పంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం ►16 వార్డు నుంచి 25 వార్డుల ఓట్ల లెక్కింపు ►హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న కుప్పం కౌంటింగ్ ప్రక్రియ 11:55AM వైఎస్సార్ జిల్లా కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు కమలాపురం మున్సిపల్ ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 'ఈ ఎన్నికల్లో కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ఓటు చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. 15 వార్డుల్లో గెలుపొందాం. ఓడిన 5 వార్డుల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. ఛైర్మెన్ అభ్యర్థి ఖరారుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 11:45AM నెల్లూరు జిల్లా ►బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయితీ వైఎస్సార్సీపీ కైవసం ► మొత్తం 20 వార్డుల్లో.. 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. 11:15AM నెల్లూరు ►కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1390 ఓట్లతో విజయం ►టీడీపీ కంచుకోట డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల ముందంజ కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 11:05AM ►రాజంపేట మున్సిపల్ వైఎస్సార్సీపీ కైవసం ►రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దర్శి మున్సిపాలిటీలో టీడీపీ విజయం ► దర్శి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ-7, టీడీపీ- 13 వార్డుల్లో విజయం సాధించింది. ► దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► దాచేపల్లిలో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ-7 వార్డులు, ఇండిపెండెంట్-1, బీజేపీ-1 వార్డులో గెలుపొందాయి. 10:50AM ►గురజాల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ కైవసం ► గురజాల 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన విజయం ► కమలాపురం నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ►కమలాపురంలో 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం ►మొత్తం 20 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-15, టీడీపీ-5 వార్డుల్లో విజయం సాధించాయి. ► బేతంచర్ల నగరపంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం ► 14వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైఎస్సార్సీపీ ఆధిక్యం.. ఇందులో ఇప్పటికే వైఎస్సార్సీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. నెల్లూరు జిల్లా ►కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ హవా ►37 డివిజన్లలో ముందంజ 10:40AM ►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం మొత్తం 20 వార్డుల్లో 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ► పెనుకొండ మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం ►మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-18, టీడీపీ-2 వార్డుల్లో విజయం సాధించాయి. 10:30AM బుచ్చి నగరపంచాయితీలో దూసుకు పోతున్న వైఎస్సార్సీపీ ►డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలు. ►ఒకటో వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో విజయం.. ►మూడో వార్డు లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రత్యూష విజయం.. ►నాలుగో వార్డ్ లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా విజయం.. ►7వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షకీలా విజయం.. ►18వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జయంతి విజయం.. ►9వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డి విజయం.. ►14 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్ ముందంజ.. ►15 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజ.. అనంతపురం ►పెనుకొండ నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ►మొత్తం 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం 10:25AM కుప్పంలో వైఎస్సార్సీపీ హవా ►మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 10 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం 10:20AM ►పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఫ్యాన్ జోరు ►మొత్తం 20 వార్డులకుగానూ 13 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 10:18AM కర్నూలు జిల్లా ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 14 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మధుసూదన్ రావు గెలుపు ►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 20 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి శకుంతల గెలుపు అనంతపురం జిల్లా ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ హవా ►మొత్తం 20 వార్డుల్లో 10 వార్డులు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత 10:12AM వైఎస్సార్ జిల్లా.. కమలాపురం 2 వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మోహమ్మద్ సాదిక్ 324 ఓట్లతో భారీ విజయం ►18 వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి కుప్పూరి సుదర్శన్ రెడ్డి 18 ఓట్లతో విజయం ►3 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ నూరి 134 ఓట్లతో విజయం ►కమలాపురం 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం ► రాజంపేట 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి మర్రి రవి కుమార్ విజయం ►21వ వార్డులో పోలా రమణా రెడ్డి వైఎస్సార్సీపీ విజయం 10:02AM గురజాల ►నగర పంచాయతీలో 2 వార్డు లో 377 మెజార్టీ వైసిపి గెలుపు ►గురజాల 15వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన్యం కన్యాకుమారి 101 ఓట్లతో గెలుపు 10.02AM: చిత్తూరు జిల్లా: ►కుప్పం 1,2,7 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం 9:50AM గుంటూరు: ►దాచేపల్లి 13వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి వందనపు లక్ష్మి 159 ఓట్లమెజార్టీతో గెలుపు ►దాచేపల్లి 6వ వార్డు టీడీపీ అభ్యర్థి 94 ఓట్లతో గెలుపు ►గురజాల ఒకటో వార్డువైఎస్సార్సీపీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్లతో గెలుపు ►అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ లోని 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం ►18 వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిని విజయం 9:45 AM అనంతపురం: ►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ బోణీ ►14, 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యత వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►17 వార్డు వైసీపీ అభ్యర్థి కలవ నాగమణి 27 ఓట్ల మెజార్టీతో విజయం వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►9 వార్డు లో వైసీపీ అభ్యర్థి మారుజోళ్ళ శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో విజయం.. ►10 వార్డులో వైసీపీ అభ్యర్థి గెంటెమ్ సుగంధి 81 మెజార్టీతో విజయం.. వైఎస్సార్ జిల్లా.. కమలాపురం ►16 వార్డు వైసీపీ అభ్యర్థి కొప్పు షాహీనా బేగం 144 ఓట్లతో విజయం 9.40AM వైఎస్సార్ జిల్లా ►కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం 09:22AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. ►14వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మునిస్వామి ఏకగ్రీవ ఎన్నిక ►నగిరి మున్సిపాలిటీ 17వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గంగాధరం ఏకగ్రీవం 09:14AM బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో వార్డుల వారీగా పార్టీలకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు మొత్తం పోస్టుల బ్యాలెట్ లు - 114 వైఎస్సార్సీపీ - 66 టీడీపీ - 20 బీజేపీ - 27 సీపీఎం - 1 వైఎస్సార్ జిల్లా ►కమలాపురం 11 వార్డులో 83 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పోలి సలీల విజయం ►కమలాపురం 15వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం 08:44AM గుంటూరు జిల్లా ►ప్రారంభమైన గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ►ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన అధికారులు ►ఓట్లను కట్టలు కడుతున్న అధికారులు 08:40AM నెల్లూరు జిల్లా ►ప్రారంభమైన కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ►పోస్టల్ బ్యాలెట్లు లెక్కస్తున్న సిబ్బంది 08:37AM తూర్పుగోదావరి జిల్లా ►కాకినాడ నగరపాలక సంస్థ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ►3,9,16,30. డివిజన్లకు ఈ నెల 15 న జరిగిన పొలింగ్ ►మొత్తం 15 మంది అభ్యర్ధులు పోటి, 51.46 % పోలింగ్ నమోదు ►రంగరాయ మెడికల్ కళశాలలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ►8 టేబుళ్ళు ఏర్పాటు, మధ్యహన్నం కల్లా వెలువడనున్న ఫలితాలు 08:31AM ప్రకాశం జిల్లా ►దర్శి నగర పంచాయతీకి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. ►19 వార్డులకు కౌంటింగ్ కోసం 38 టేబుల్స్ ఏర్పాటు ►100 మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు 08:21AM కృష్ణా జిల్లా ►తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లు ►స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలింపు ►మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కట్టనున్న కౌంటింగ్ సిబ్బంది ►తొలిఫలితం 11 గంటలకు తెలిసే అవకాశం ►16 టేబుళ్ల పై కౌంటింగ్ ►రెండు రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్ ►ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్న పోలీసులు ►కౌంటింగ్‌కు పకడ్భందీ చర్యలు.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు 08:17AM కర్నూలు జిల్లా ►ప్రారంభమైన బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ ►మొత్తం 20 వార్డులకు సంబంధించి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ►20 వార్డులకు గాను 20 టేబుళ్ల ఏర్పాటు ►ఒకటే రౌండ్లో ముగియనున్న ఓట్ల లెక్కింపు. ►11 గంటలలోపే వెలువడనున్న ఫలితాలు 08:10AM చిత్తూరు జిల్లా ►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మూడుకు గానూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. 08:00AM నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉ.8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఓట్ల లెక్కింపు బుధవారం ఉ.8 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. సా.5 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ సూపర్వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లుగా 3,792 మందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్లు పోను మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు సమకూర్చారు. లెక్కింపు ప్రక్రియ చిత్రీకరణ ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్ల వెలుపల చిన్నచిన్న ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారుల నుంచి నివేదికలు అందాయన్నారు. అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్ జరిగిందని.. రీపోల్ నిర్వహించాలన్న వినతులు అందలేదన్నారు. -
ప్రాణాలు పోతుంటే ఎన్నికల కౌంటింగా? ప్రశ్నించిన సుప్రీం
లక్నో : ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌కు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనల్ని పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్‌లో ఏప్రిల్ 15, 19, 26, 29 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకింది. వీరిలో 577 మంది టీచర్లు మృతి చెందినట్లు టీచర్స్ అసోసియేషన్ చెబుతోంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 2వ తేదీ పంచాయతీ ఎన్నికల ఫలితాలనైనా నిలిపివేయాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు 'ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని మీరు భావించారా? ఎటు చూసినా సమస్యలే. మీకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అందుకు ఎన్నికల సంఘం.. పంచాయతీ ఎన్నికల లెక్కింపును వాయిదా వేయడం వల్ల కరోనాపై పోరాడేందుకు నియమితులైన 5 లక్షల మంది సిబ్బంది సేవలు వృధా అవుతాయని వివరణిచ్చింది. ఈ వివరణపై సంతృప్తి చెందిన అత్యున్నత న్యాయం స్థానం..800 కేంద్రాల్లో 2 లక్షలకుపైగా సీట్లకు కౌంటింగ్ జరపాల్సి ఉంటుంది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 800 సీట్లను లెక్కించే సమయంలో ఎక్కువ మంది ఉంటే ఎలా కట్టడి చేస్తారని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ ఉన్నందున పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, అలా చేస్తే ప్రజల్ని నియంత్రిచడం సులభం అవుతుందని" అదనపు సొలిసిటర్ జనరల్ భాటి అన్నారు. ప్రతి అంశాన్ని అఫిడవిట్లో పొందుపరుస్తామని వివరించారు. దీంతో సుప్రీంకోర్ట్ కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. -
కూలిన ‘దేశం’ కంచు కోటలు
సాక్షి, అమరావతి: తొలి రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలే మూడో విడతలోనూ పునరావృతం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మొదలు.. శ్రీకాకుళం జిల్లా వరకు అన్నింటా టీడీపీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడున్నర దశాబ్దాల కాలంలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాగా వేసిన కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. అధిక పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు డిపాజిట్లు కోల్పోయారు. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్సీపీ అభిమానులు 75 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ మద్ధతుదారులు మాత్రం కేవలం 14 స్థానాలకే పరిమితం అయ్యారు. అదే 2013లో 93 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అప్పట్లో 12 చోట్ల మాత్రమే వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆ సీన్ రివర్స్ అయ్యింది. నియోజకవర్గంలోని గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం ఇలా నాలుగు మండలాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు తిరుగులేని విజయం సాధించారు. చదవండి: (కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ) కుప్పంలో మొత్తంగా 30 వేల మెజార్టీ ♦కుప్పం నియోజకవర్గంలో వైస్సార్సీపీ అభిమానులకు వచ్చిన ఓట్లను లెక్కిస్తే 30 వేలకు పైగానే మెజార్టీ దాటింది. వివిధ కారణాలతో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించి ఉంటే మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉండింది. ♦టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న అమర్నాథ్రెడ్డికి చెందిన పలమనేరు నియోజకవర్గంలో 90 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 76 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, కేవలం 13 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ♦అమర్నాథ్రెడ్డి మరదలు అనీషరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో ఒక్క స్థానంలో కూడా టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. మొత్తం 85 పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ‘అనంత’లోనూ భంగపాటు ♦ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 117 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్సీపీ అభిమానులు 93 స్థానాల్లో, టీడీపీ 20, ఇతరులు రెండు చోట్ల మాత్రమే గెలుపొందారు. ♦ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండలం కెకె అగ్రహారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్వగ్రామం. ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ అభిమానే విజయం సాధించడం విశేషం. ♦తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు పంచాయతీ ఎన్నికల్లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 85 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఇందులో 53 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, 28 చోట్ల టీడీపీ, నాలుగు చోట్ల ఇతరులు గెలుపొందారు. ♦ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని 68 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 52 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు, కేవలం 13 చోట్ల టీడీపీ, రెండు చోట్ల ఇతరులు విజయం సాధించారు. ♦ రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రభావం ఏమీ కన్పించలేదు. 38 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ మద్దతుదారులు కేవలం 4 స్థానాలకే పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీ అభిమానులు 34 చోట్ల ఘన విజయం సాధించారు. ♦ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 3 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్సీపీ అభిమానులే ఘన విజయం సాధించారు. ♦ గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి ఆర్.జితేంద్రగౌడ్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించిన 68 పంచాయతీల్లో 55 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. టీడీపీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. చదవండి: (కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది) స్పీకర్ తమ్మినేని సతీమణి విజయం ♦ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి, మాజీ చీప్ విప్ కూన రవికుమార్‌కు ఎదురుగాలి వీచింది. 108 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 75 చోట్ల వైఎస్సార్సీపీ, 33 స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తొగరాం సర్పంచ్‌గా స్పీకర్ తమ్మినేని సీతారం సతీమణి తమ్మినేని వాణి విజయం సాధించారు. ♦ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన స్వగ్రామం చల్లవానితోట పంచాయతీకి ఆయన మనుమడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తారకరామ నాయుడు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో మొత్తం 207 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 174 స్థానాల్లో వైఎస్సార్సీపీ, కేవలం 32 స్థానాల్లో టీడీపీ, ఒక చోట ఇతరులు గెలుపొందారు. కర్నూలులోనూ అదే జోరు ♦ కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ పప్పులేవీ ఉడకలేదు. ఈ నియోజకవర్గంలో 81 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 69 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, 11 స్థానాల్లో టీడీపీ, ఒక చోట ఇతరులు విజయం సాధించారు. ♦ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గమైన పత్తికొండలోనూ టీడీపీకి ఎదురుగాలి వీచింది. 87 పంచాయతీలకుగాను 55 చోట్ల వైఎస్సార్సీపీ, 26 చోట్ల టీడీపీ, 6 చోట్ల ఇతరులు విజయం సాధించారు. ♦ టీడీపీ నాయకులు గౌరు చరిత, వెంకటరెడ్డి దంపతులు, బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిల నియోజకవర్గమైన నందికొట్కూరులో ఊహించని ఫలితాలొచ్చాయి. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్వగ్రామం ముచ్చుమర్రిలో వైఎస్సార్సీపీ అభిమాని విజయఢంకా మోగించారు. నియోజకవర్గంలో 77 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా 62 చోట్ల వైఎస్సార్సీపీ, 12 స్థానాల్లో టీడీపీ, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. గుంటూరు, కృష్ణాలో ‘దేశం’ డీలా ♦ గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం మంచికల్లులో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 57 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 53 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 3 స్థానాల్లో టీడీపీ, జనసేన మద్దతుదారులు ఒక చోట విజయం సాధించారు. ♦ మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు నిర్వహించిన రెండు స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులే విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న అన్నపురెడ్డి అంజిరెడ్డి ఎక్కడా కూడా తన ప్రభావం చూపలేకపోయారు. ♦ టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ నియోజకవర్గమైన కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభిమానులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. 71 పంచాయతీలకుగాను 45 చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు, 18 చోట్ల టీడీపీ, 5 స్థానాల్లో జనసేన, 3 చోట్ల ఇతరులు గెలుపొందారు. ♦ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గమైన మచిలీపట్నంలో టీడీపీ మద్దతుదారులు కేవలం 6 స్థానాలకే పరిమితం అయ్యారు. 17 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు, రెండు చోట్ల జనసేన మద్దతుదారులు గెలుపొందారు. -
నిమ్మగడ్డ ఊరులో వైఎస్సార్సీపీ అభిమానుల హవా
సాక్షి, తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్వగ్రామంలో వైఎస్సార్సీపీ అభిమానులు విజయకేతనం ఎగురవేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన గృహం ఉన్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ అభిమానులు గెలుపొందారు. గ్రామ సర్పంచ్ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సొంత వార్డులో వైఎస్సార్సీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి. చదవండి: (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..) (టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే) (తొలివిడతపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి) -
రెండో విడత పంచాయితీ ఎన్నికలలోనూ టీఆర్ఎస్ జోరు
-
పంచాయతీ ఎన్నికల రెండవ విడతలోనూ టీఆర్ఎస్దే హవా!
-
రెండో విడతలోనూ టీఆర్ఎస్దే హవా!
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి మొదలుకాగానే కారు జోరు చూపిస్తోంది. 3 వేల 341 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో మొదటి విడతలో మాదిరే కారు స్పీడును కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో సహ ఏ పార్టీ అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 733 టీఆర్ఎస్ మద్దతుదారులు, 70 కాంగ్రెస్ మద్దతుదారులు, ఇతరులు 119 స్థానాల్లో గెలుపొందారు. మరో రెండు గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి. జిల్లాలు టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఇతరులు ఆదిలాబాద్ 9 11 0 0 51 భద్రాద్రి 21 5 2 0 8 జగిత్యాల 22 3 0 0 7 జనగామ 30 2 0 0 2 జయశంకర్ 14 6 2 0 2 జోగులాంబ 15 1 0 0 3 కామారెడ్డి 70 26 0 0 13 కరీంనగర్ 10 1 0 0 4 ఖమ్మం 58 4 5 0 8 కొమరం భీం 26 5 0 1 3 మహబూబాబాద్ 49 5 0 0 0 మహబూబ్ నగర్ 71 6 0 0 15 మంచిర్యాల 24 4 0 0 3 మెదక్ 61 5 0 0 5 మేడ్చల్ 7 0 0 0 0 నాగర్ కర్నూల్ 19 2 0 0 0 నల్గొండ 51 1 0 0 0 నిర్మల్ 21 4 0 0 0 నిజామాబాద్ 31 2 0 0 1 పెద్దపల్లి 7 1 0 0 1 రాజన్న 16 0 0 0 0 సంగారెడ్డి 49 2 1 0 0 సిద్దిపేట 18 0 0 0 0 సూర్యాపేట 24 0 0 0 5 వికారాబాద్ 12 1 0 0 5 వనపర్తి 17 0 0 0 4 వరంగల్ రూరల్ 31 2 0 0 0 వరంగల్ అర్బన్ 2 0 0 0 0 యాదాద్రి 17 0 0 0 0 -
ఊరూ గులాబిదే!
-
పంచాయితీ పోరులో కాంగ్రెస్ హవా
చండీగఢ్ : పంజాబ్‌లో ఆదివారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ సత్తా చాటింది. 13,000కు పైగా గ్రామాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక పంచాయితీలను అధికార కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గెలుపొందిన సర్పంచ్‌లు, పంచాయితీల సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామీణ భారతంలో సానుకూల మార్పులకు ఈ ఎన్నికల్లో విజేతలు శ్రీకారం చుట్టాలని కోరింది. కాగా, పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన వారికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ద్వారా విజయం సాధించిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విపక్ష ఆప్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఆరోపించాయి. ప్రజలకు ఎలాంటి మేలు చేయని కాంగ్రెస్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధైర్యం లేక హింసకు పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని ఎస్ఏడీ అధ్యక్షుడు సుక్భీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బూత్‌లను స్వాధీనం చేసుకుని యధేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఎస్ఏడీ సీనియర్ నేత దల్జీత్ సింగ్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని విపక్ష నేత, ఆప్ సీనియర్ నాయకుడు హర్పాల్ చీమ ఆందోళన వ్యక్తం చేశారు. -
పంచాయతీల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ
నల్గొండ: నల్గొండ జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలకు అధికార టిఆర్ఎస్ పార్టీ ఐదు, కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు చందంపల్లి, కడపర్తి, అమ్మనబోలును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మానాయికుంట, చందూపట్ల, తాటికల్, నేల్లిబండ, నోముల గ్రామ పంచాయతీలను టిఆర్ఎస్ దక్కించుకుంది. గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్కు గట్టి పోటినిచ్చింది. -
'ఐఎస్ఐఎస్లాగే ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదే'
అలీగఢ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోల్చడంపై హిందూవాదులే కాదు ఉదారవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబిబ్ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గడం లేదు. ఐఎస్ఐఎస్లాగా ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదని ఆయన మరోసారి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 'ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సింది ఉదారవాదులే కాదు.. అది అందరి బాధ్యత. లౌకిక విలువలను కాపాడటానికి దేశ ప్రజలందరూ ముందుకురావాలి. ప్రజాస్వామిక, లౌకిక విలువలను ప్రజలు కాపాడుకుంటున్నారని చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సంకేతం' అని ఇర్ఫాన్ హబిబ్ తెలిపారు. మతం పేరిట ఉగ్రవాద భావజాలాలు అనుసరించే వ్యక్తుల అజ్ఞానం నేపథ్యంలోనే తాను ఆరెస్సెస్‌ను ఐఎస్ఐఎస్తో పోల్చానని చెప్పారు. 'అజ్ఞానం, మూర్ఖత్వం విషయంలో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ ఒక్కటే. 1947నాటి ఘటనలు విద్వేష నేరాల్లో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ను అధిగమించిందని చాటుతాయి. భారత చరిత్రను ఆరెస్సెస్ తప్పుగా చిత్రిస్తుంది. అది దేశాన్ని కించపరుస్తుంది' అని ఆయన పేర్కొన్నారు. -
నెల రోజులు ఆగాల్సిందే
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, 7 మునిసిపాలిటీలు, ఒక నగర పం చాయతీ ఎన్నికల ఫలితాల కోసం నెల రోజుల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలి తాలను మే 7వ తేదీ తరువాతే ప్రకటించాలని సుప్రీం కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లాలోని మునిసిపాలిటీ ల్లో ఎన్నికల కౌంటింగ్ మరోసారి వారుుదా పడింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీ ర్పును అనుసరించి ఈ నెల 9న కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అరుుతే, ఈ ఫలి తాలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రరుుంచిన నేపథ్యంలో కౌంటింగ్‌కు బ్రేక్ పడింది. పెరిగిన ఉత్కంఠ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పక్షాల్లో ఇప్పటికే నెలకొన్న ఉత్కంఠ కోర్టు తీర్పు నేపథ్యంలో మరింత పెరిగింది. ఎన్నికలు జరిగి దాదాపు 10 రోజులైంది. మరో నెల రోజులపాటు వేచి ఉండాల్సి రావడంతో పందేల రాయుళ్లు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. పార్టీల వెంట తిరిగిన పలువురు పోలింగ్ సరళి ఆధారంగా అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపై పందాలు కాశారు. ప్రతి పట్టణంలోనూ లక్షలాది రూపాయల మేర పందాలు సాగారుు.