ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, 7 మునిసిపాలిటీలు, ఒక నగర పం చాయతీ ఎన్నికల ఫలితాల కోసం నెల రోజుల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలి తాలను మే 7వ తేదీ తరువాతే ప్రకటించాలని సుప్రీం కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లాలోని మునిసిపాలిటీ ల్లో ఎన్నికల కౌంటింగ్ మరోసారి వారుుదా పడింది.
ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీ ర్పును అనుసరించి ఈ నెల 9న కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అరుుతే, ఈ ఫలి తాలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రరుుంచిన నేపథ్యంలో కౌంటింగ్‌కు బ్రేక్ పడింది.
పెరిగిన ఉత్కంఠ
మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పక్షాల్లో ఇప్పటికే నెలకొన్న ఉత్కంఠ కోర్టు తీర్పు నేపథ్యంలో మరింత పెరిగింది. ఎన్నికలు జరిగి దాదాపు 10 రోజులైంది. మరో నెల రోజులపాటు వేచి ఉండాల్సి రావడంతో పందేల రాయుళ్లు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. పార్టీల వెంట తిరిగిన పలువురు పోలింగ్ సరళి ఆధారంగా అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపై పందాలు కాశారు. ప్రతి పట్టణంలోనూ లక్షలాది రూపాయల మేర పందాలు సాగారుు.
నెల రోజులు ఆగాల్సిందే
Published Tue, Apr 8 2014 4:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement