Counting the election
-
అటు ఎన్నికల విధులు..ఇటు గ్రూప్–1 గుబులు!
సాక్షి, అమరావతి: ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలలుగా సాధారణ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నామని, కనీసం ఊపిరిపీల్చుకునే సమయం కూడా లేకుండా ఏపీపీఎస్సీ పరీక్షల విధులు ఎలా నిర్వహించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రూప్–1 కేటగిరీలోని 169 పోస్టుల భర్తీకి తలపెట్టిన ప్రిలిమ్స్ పరీక్ష 26న జరగనుంది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేపట్టింది. 254 పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు 1.14 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 17వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీచేస్తోంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలకపాత్ర పోషించే రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉండే సమయంలో ఈ పరీక్షలను నిర్వహిస్తుండటంపై విమర్శలొస్తున్నాయి. పైగా ఈ పరీక్షలకు పోటీపడుతున్న వారిలో అనేకమంది ప్రస్తుతం వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న వారున్నారు. ప్రస్తుతం వారంతా ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో పరీక్షలుండటంతో వారంతా అయోమయానికి గురవుతున్నారు. నిర్ణీత సమయం ఇవ్వకుండా.. గ్రూప్–1 నోటిఫికేషన్ తర్వాత కనీసం 150 రోజుల వ్యవధి ఇచ్చి ప్రిలిమ్స్ పెట్టాలి. కానీ ఏపీపీఎస్సీ కేవలం 69 రోజుల వ్యవధి ఇచ్చి మార్చి 10వ తేదీన పరీక్షలంటూ ప్రకటన ఇచ్చింది. దీనిపై అభ్యర్థులు ఆందోళనలకు దిగడంతో మార్చి 31కి మార్పు చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో షెడ్యూల్‌ను మే 26కి వాయిదా వేసింది. ఈ నెల 23న సాధారణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈసారి వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉండటంతో 24వ తేదీకి గానీ కౌంటింగ్ పూర్తికాదు. ఆ తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా రూపొందించే పనిలో ఉన్నతాధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉంటారు. ఈ తరుణంలో ఆ మర్నాడే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ఉండటంతో రెవెన్యూ యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే ఈ గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి తొలి నుంచీ ఏదో ఒక వివాదం ఏర్పడుతూనే ఉంది. రెండుసార్లు షెడ్యూల్ మార్పుచేయాల్సి రావడం, పోస్టుల కుదింపు, ఏడాదిలోనే సిలబస్ మార్పు, పరీక్షల విధానంలోనూ కొత్తగా మార్పులు.. తదితర అంశాలు ఈ పరీక్షల కోసం పోటీపడుతున్న లక్షలాది నిరుద్యోగులను ఇబ్బందులుపెట్టాయి. పోస్టులు కుదించి నోటిఫికేషన్.. ఏడాదిలోనే సిలబస్ మార్పు గ్రూప్–1 పోస్టుల ఖాళీలున్నా ప్రభుత్వం వాటన్నింటినీ భర్తీచేయడం లేదు. రాష్ట్ర విభజన నాటికి గ్రూప్–1 పోస్టులు 245 ఉండగా రిటైరైన వారి పోస్టులను కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇంతకు ముందు కేవలం 78 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత 182 పోస్టులు భర్తీచేస్తామని జీవో ఇచ్చి నోటిఫికేషన్లో 169 పోస్టులనే చూపారు. అలాగే 2016లో ప్రకటించిన గ్రూప్–1 నోటిఫికేషన్ సమయంలో ఏపీపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేసింది. దీంతో అప్పటివరకు ఉన్న సిలబస్‌తో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. 2018 చివర్లో ప్రస్తుత గ్రూప్–1కు నోటిఫికేషన్ ఇచ్చే కొద్దిరోజుల ముందు ఏపీపీఎస్సీ మళ్లీ సిలబస్ మార్పుచేసి ముసాయిదాను, తుది సిలబస్‌ను ప్రకటించి.. మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాదిలోపలే గ్రూప్–1 వంటి కీలక పరీక్ష సిలబస్‌ను హఠాత్తుగా మార్పు చేయడంపై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా రెండు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన ముఖ్యులు ఏపీపీఎస్సీలో చక్రం తిప్పుతున్నందునే ఇలా జరుగుతోందని ప్రచారం ఏడాది తిరక్కుండానే ఎన్నో మార్పులు గతంలో గ్రూప్–1లో స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 మార్కులకు ఉండగా.. ఈసారి పేపర్–1, పేపర్–2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచేశారు. గతంలో క్వాలిఫైయింగ్ పేపర్ కింద జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు ఒక్కటే ఉండగా.. ఇప్పుడు తెలుగును కూడా చేర్చారు. ప్రిలిమ్స్ పేపర్–1 గతంలో జనరల్ ఎస్సే మాత్రమే ఉండగా.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి అంశాలుంటాయని సిలబస్‌లో పొందుపరిచారు. పేపర్–2, పేపర్–3, పేపర్–4, పేపర్–5లలో గతంలో ఉన్న అంశాలను తీసేసి కొత్త వాటిని చేర్చడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. వీటిపై ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జరిగింది. -
కౌంటింగ్‌పై మే 7న రాష్ట్రస్థాయి శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్‌పై ఉన్నతాధికారులకు అవగాహన కల్పించేందుకు మే 7న రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సోమవారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆర్వోలు, ఈఆర్వోలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగించడంతో ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన నిబంధనలపై ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లను ఆర్వో, పరిశీలకుల సమక్షంలో లెక్కించాల్సి ఉండటంతో అసెంబ్లీ ఫలితాలకు ఆరు గంటలకు పైగా సమయం పడుతుందన్నారు. మొత్తం రాష్ట్రంలో 1,750 వీవీప్యాట్లలో పోలైన స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోయిన తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయించిన ఈవీఎంలపై ఆర్వో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ అభ్యర్థి మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు తక్కువ ఉంటే ఏజెంట్ల నిర్ణయం ప్రకారం ఆర్వో నడుచుకుంటారని తెలిపారు. మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఈవీఎంకు చెందిన బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలో 3.50 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని, ఇందులో 90 శాతంపైగా ఓట్లు నమోదైతే ఒక శాతం పోలింగ్ పెరుగుతుందని వివరించారు. దీంతో పోటాపోటీగా జరిగే నియోజకవర్గాల్లో ఈ ఓట్లు ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. -
మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. కౌంటింగ్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న కౌంటింగ్ చేపట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ పురపాలక సంఘం ఓట్ల లెక్కింపునకు 7టేబుళ్లు, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ పురపాలక సంఘాలు, దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీలకు 5 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల కౌంటింగ్‌ను నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీ దగ్గర ఉన్న డాన్ బోస్కో స్కూల్లో నిర్వహిస్తారు. ప్రతి పురపాలక సంఘానికి ఒక ఒక ఆర్డీఓను ఎన్నికల అబ్జర్వర్‌గా కలెక్టర్ నియమించారు. నల్లగొండకు ట్రైనీ ఐఏఎస్ సత్యనారాయణ, కోదాడకు అదనపు జేసీ వెంకట్రావు, హుజూర్‌నగర్‌కు జేడీఏ నర్సింహారావును అబ్జర్వర్లుగా నియమించారు. మిగతా వాటికి ఆయా పరిధిలో ఉన్న ఆర్డీఓలు అబ్జర్వరులుగా వ్యవహరించనున్నారు. నల్లగొండ పురపాలక సంఘానికి సంబంధించి 7టేబుళ్లలో ఏడు వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. మితగా వాటిలో 5 టేబుళ్లలో ఒకేసారి 5 వార్డుల కౌంటింగ్ మొదలు పెట్టడానికి నిర్ణయించారు. ఒక వార్డులో ఉన్న పోలింగ్ కేంద్రాలు దాదాపు 10 నుంచి 15 నిమిషాలలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక టేబులుకు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. కౌంటింగ్‌ను జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ పర్యవేక్షంచనున్నారు. ఉదయం 7.30 గంటలకు మొదట కౌంటింగ్ చేపట్టే వార్డుల సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంల ఓట్లను లెక్కించడానికి ప్రణాళిక తయారు చేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే సమయంలో కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు ఒక ఏజంటును లోపలికి అనుమతిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు సమయంలో ఒక ఏజంటును మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు. వార్డుల ఫలితాలను ప్రకటించడానికి మైకులు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్కూల్ బయట బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒక్కో మున్సిపాలిటీ వారిగా టెంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల లోపు మొత్తం కౌంటింగ్ పూర్తి కానుంది. ఏర్పాట్లు చేస్తున్నాం : వేణుగోపాల్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్‌కు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న డాన్‌బోస్కో స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యర్థులతో పాటు వచ్చే వారి కోసం కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కేంద్రం వద్ద బారీకేడ్లు, తాగునీటి సౌకర్యం ఇతర అన్ని వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టాం. పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
నెల రోజులు ఆగాల్సిందే
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, 7 మునిసిపాలిటీలు, ఒక నగర పం చాయతీ ఎన్నికల ఫలితాల కోసం నెల రోజుల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలి తాలను మే 7వ తేదీ తరువాతే ప్రకటించాలని సుప్రీం కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లాలోని మునిసిపాలిటీ ల్లో ఎన్నికల కౌంటింగ్ మరోసారి వారుుదా పడింది. ఇంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీ ర్పును అనుసరించి ఈ నెల 9న కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అరుుతే, ఈ ఫలి తాలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రరుుంచిన నేపథ్యంలో కౌంటింగ్‌కు బ్రేక్ పడింది. పెరిగిన ఉత్కంఠ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పక్షాల్లో ఇప్పటికే నెలకొన్న ఉత్కంఠ కోర్టు తీర్పు నేపథ్యంలో మరింత పెరిగింది. ఎన్నికలు జరిగి దాదాపు 10 రోజులైంది. మరో నెల రోజులపాటు వేచి ఉండాల్సి రావడంతో పందేల రాయుళ్లు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. పార్టీల వెంట తిరిగిన పలువురు పోలింగ్ సరళి ఆధారంగా అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపై పందాలు కాశారు. ప్రతి పట్టణంలోనూ లక్షలాది రూపాయల మేర పందాలు సాగారుు.