సాక్షి, ఏలూరు : మహా సంగ్రామాన్ని తలపిస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వేలాది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని త్వరలోనే తేల్చనున్నాయి. వారి తలరాతలు ఎలా ఉన్నాయనేది వరుసగా తేలిపోనుంది. మునిసిపాలిటీల్లో గెలుపెవరిదనే విషయం సోమవారం వెల్లడి కానుం ది. ఆ మరుసటి రోజే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఆ తరువాత మూడు రోజుల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఫలితాలు వెల్లడికానున్నాయి.జంబో పరిషత్ : జిల్లా పరిషత్‌లో 46 జెడ్పీటీసీ, 903 ఎంపీటీసీ స్థానాలకు మార్చి 17నుంచి 20 వరకూ నామినేషన్లు స్వీకరించారు. ఏకగ్రీవాల అనంతరం జెడ్పీటీసీ పదవులకు 151 మంది, ఎంపీటీసీ పదవులకు 2,222 మంది బరిలో ఉన్నారు. వారిలో జెడ్పీటీసీ పదవులకు 28 మంది, ఎంపీటీసీ పదవులకు 375 మంది స్వతంత్ర అభ్యర్థులు. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 7న ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలోని 22 మండలాలకు, ఏప్రిల్ 11న మలి విడత పోలింగ్ నరసాపురం, కొవ్వూరు డివిజన్లలోని 24 మండలాల్లో నిర్వహించారు. ఈనెల 13న ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరం కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు వెలువరించనున్నారు.
పుర పీఠముడి
జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరిగారుు. కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ మినహా మిగిలిన పాలకవర్గాలకు 2010 సెప్టెంబర్‌తో గడువు ముగిసింది. అయినా ఎన్నికలు జరపలేదు. ఎట్టకేలకు మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఏలూరు నగరపాలక సంస్థకు అదే 10నుంచి 13వ తేదీ వరకు, పురపాలక సంఘాలకు 10నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరించారు. 291 వార్డు/డివిజన్ స్థానాలకు గాను 1,980 నామినేషన్లు దాఖలయ్యూరుు. మార్చి 15న నామినేషన్ల పరిశీలన జరపగా, 18వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. మొత్తంగా 1,026 నామినేషన్లు ఉపసంహరణ, తిరస్కరణకు గురయ్యాయి. 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 287 వార్డులు/డివిజన్లకు 946 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మార్చి 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించి, ఏప్రిల్ 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టాలని మందుగా నిర్ణయించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఈ నెల 12న ఆయూ పురపాలక సంఘాల్లో ఓట్లు లెక్కించి ఎక్కడికక్కడ ఫలితాలు ప్రకటిస్తారు.
అసలు పోరు
సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఈనెల 19వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించారు. రెండు ఎంపీ స్థానాల్లో 36 మంది, 15 అసెంబ్లీ స్థానాల్లో 273 మంది నామినేషన్లు వేశారు. 21న పరిశీలన, 23న ఉపసంహరణ జరిగారుు. ఎంపీ స్థానాల్లో 7, అసెంబ్లీ స్థానాల్లో 110 నామినేషన్లు తిరస్కరణ, ఉపసంహరణకు గురయ్యాయి. చివరకు ఎంపీ పదవులకు 29 మంది, ఎమ్మెల్యే పదవులకు 163 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సార్వత్రిక పోలింగ్ మే 7వ తేదీన నిర్వహించారు. ఈనెల 16న ఫలితాలు విడుదల కానున్నాయి. ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో, భీమవరంలోని విష్ణు కళాశాలలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
కొనుగోలు కేంద్రాల జాడేది
పెదపాడు, న్యూస్‌లై న్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వాపోతున్నారు. వరి పంటకు మద్దతు ధర లభించడం లేదని ఆందోళన చెందుతున్నారు. పెదపాడు మండలంలో 8 వేల ఎకరాల్లో రైతులు దాళ్వా సాగు చేశారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా ఎక్కడా కానరావడం లేదు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
12.. 13.. 16
Published Sun, May 11 2014 12:45 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement