AP Municipal Elections 2021 Results Live | Nagar Panchayat Election 2021 Results Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ 

Published Wed, Nov 17 2021 5:42 AM | Last Updated on Thu, Nov 18 2021 8:05 AM

AP Municipal And Nagar Panchayat Election 2021 Results Live Updates - Sakshi

AP Municipal Elections 2021 Results Live Updates: 

04: 57PM  
  కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం
  మొత్తం 31 వార్డుల్లో..  వైఎస్సార్‌సీపీ-17, టీడీపీ-14 వార్డుల్లో విజయం సాధించాయి. 

04: 20PM  
  జగ్గయ్యపేట మున్పిపాలిటీని కైవసం చేసుకునే దిశంగా వైఎస్సార్‌సీపీ 
  రెండో రౌండ్‌లో 11 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం 
  ఇప్పటికే 8 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ

► కాకినాడలో ఉప ఎన్నిక జరిగిన 4 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.  
► కాకినాడలోని 3, 9, 16, 30వ డివిజన్లలో వైస్సార్‌సీపీ గెలుపొందింది.

03: 54PM 
 రాజంపేట మున్సిపాలిటీ వైఎ‍స్సార్‌సీపీ కైవసం
 మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ-24, టీడీపీ-4, ఇండిపెండెంట్‌-1 వార్డులో విజయం సాధించాయి.  

 గురజాల నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం
 మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 16, టీడీపీ-3, జనసేన-1 వార్డులో విజయం సాధించాయి. 

ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం 
► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ-12, టీడీపీ-4, జనసేన-3 వార్డుల్లో విజయం సాధించాయి. 

03:32PM 
కృష్ణా: కొండపల్లిలో ముగిసిన కౌంటింగ్‌
 కొండపల్లిలో 29 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ-14 స్థానాల్లో విజయం, టీడీపీ- 14 స్థానాల్లో విజయం, ఇండిపెండెంట్-1 స్థానంలో గెలుపు  
03:15PM 
► నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ 
► నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ ప్లాప్‌ షో
► బొక్కబోర్లాపడ్డ సైకిల్‌
► 54కి గాను 54 డివిజిన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు
కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం 
ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్‌సీపీ
క్లీన్ స్వీప్‌తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ

02:29PM 
విశాఖపట్నం: జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బీపిన్ కుమార్ జైన్ విజయం సాధించారు.
జీవిఎంసీలో 61వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం 
► 2028 ఓట్ల మెజార్టీతో కొణతాల సుధ(వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు. 
కృష్ణాజిల్లా:
► కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జోగిరాము గెలుపొందారు.
 26వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుంజా శ్రీనివాసు విజయం సాధించారు.
► కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మండే చంద్రశేఖర్ బాబు గెలుపొందారు.

01:40PM
కుప్పం గెలుపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

01:36PM
మొదటి రౌండ్‌లోనే కుప్పం మున్సిపల్‌ ఫలితం
రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్‌ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్‌లోనే తేలిపోయింది. మొదటి రౌండ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌​పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకున్నారు. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.

01:00PM
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 

12:50PM
►నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
►నెల్లూరు కార్పొరేషన్‌ 27 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం

►ఇప్పటి వరకు 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
►కుప్పం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైఎస్సార్‌సీపీ గెలుపు

12:40PM
►నెల్లూరు కార్పొరేషన్‌ 7 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం
►14,27,28,33,39,41,53 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ గెలుపు
►మరో 32 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

12:15PM
►కుప్పంలో రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం
►16 వార్డు నుంచి 25 వార్డుల ఓట్ల లెక్కింపు
►హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న కుప్పం కౌంటింగ్‌ ప్రక్రియ

11:55AM
వైఎస్సార్ జిల్లా
కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు
కమలాపురం మున్సిపల్ ఎన్నికల విజయంపై ఎమ్మెల్యే  రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. 'ఈ ఎన్నికల్లో కమలాపురం రౌడీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ఓటు చేశారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. 15 వార్డుల్లో గెలుపొందాం. ఓడిన 5 వార్డుల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. ఛైర్మెన్ అభ్యర్థి ఖరారుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

11:45AM
నెల్లూరు జిల్లా 
►బుచ్చిరెడ్డి పాలెం  నగర పంచాయితీ వైఎస్సార్‌సీపీ కైవసం 
► మొత్తం 20 వార్డుల్లో..  18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించగా.. టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది.

11:15AM
నెల్లూరు
►కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల 
►39వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1390 ఓట్లతో విజయం 
►టీడీపీ కంచుకోట డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ముందంజ

కుప్పంలో వైఎస్సార్‌సీపీ హవా
►మొదటి రౌండ్‌లో 14 వార్డులకుగాను 12 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

11:05AM
►రాజంపేట మున్సిపల్‌ వైఎస్సార్‌సీపీ కైవసం
►రాజంపేటలో 24వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

►దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, గురజాల, పెనుగొండలో నగర పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

దర్శి మున్సిపాలిటీలో టీడీపీ విజయం
► దర్శి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ-7, టీడీపీ- 13 వార్డుల్లో విజయం సాధించింది.

► దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం 
► దాచేపల్లిలో 11 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం, టీడీపీ-7 వార్డులు, ఇండిపెండెంట్‌-1, బీజేపీ-1 వార్డులో గెలుపొందాయి.

10:50AM
గురజాల నగరపంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం
► గురజాల 16 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కైవసం
► గురజాల 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన విజయం

► కమలాపురం నగరపంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం
►కమలాపురంలో 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం
►మొత్తం 20 వార్డుల్లో..  వైఎస్సార్‌సీపీ-15, టీడీపీ-5 వార్డుల్లో విజయం సాధించాయి.  

► బేతంచర్ల నగరపంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం
► 14వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం

కుప్పంలో వైఎస్సార్‌సీపీ హవా
►మొదటి రౌండ్‌లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యం.. ఇందులో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది.

నెల్లూరు జిల్లా
►కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ హవా 
►37 డివిజన్లలో ముందంజ

10:40AM
►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం
మొత్తం 20 వార్డుల్లో 12 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం

► పెనుకొండ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం
►మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ-18, టీడీపీ-2 వార్డుల్లో విజయం సాధించాయి.

10:30AM
బుచ్చి నగరపంచాయితీలో దూసుకు పోతున్న వైఎస్సార్సీపీ 
►డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో కొనసాగుతున్న ఎన్నికల కౌంటింగ్
ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలు.
►ఒకటో వార్డులో  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో విజయం..
►మూడో వార్డు లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  ప్రత్యూష విజయం..
►నాలుగో వార్డ్ లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా విజయం..
►7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షకీలా విజయం..
►18వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయంతి విజయం..
►9వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డి విజయం..
►14 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చీర్ల ప్రసాద్ ముందంజ..
►15 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంట అనంతమ్మ ముందంజ..

అనంతపురం
►పెనుకొండ నగర పంచాయతీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం
►మొత్తం 20 వార్డులకుగాను 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం

10:25AM
కుప్పంలో వైఎస్సార్‌సీపీ హవా
►మొదటి రౌండ్‌లో 14 వార్డులకుగాను 10 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

►దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కైవసం

10:20AM
►పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఫ్యాన్‌ జోరు
►మొత్తం 20 వార్డులకుగానూ 13 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

10:18AM
కర్నూలు జిల్లా
►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 14 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మధుసూదన్ రావు గెలుపు
►బేతంచర్ల నగర పంచాయితీ ఎన్నికల్లో 20 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి శకుంతల  గెలుపు

అనంతపురం జిల్లా
►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ హవా
►మొత్తం 20 వార్డుల్లో 10 వార్డులు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత

10:12AM
వైఎస్సార్ జిల్లా..
కమలాపురం 
2 వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మోహమ్మద్ సాదిక్ 324 ఓట్లతో భారీ విజయం
►18 వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుప్పూరి సుదర్శన్ రెడ్డి 18 ఓట్లతో  విజయం
►3 వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ నూరి 134 ఓట్లతో విజయం
►కమలాపురం 13 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం

► రాజంపేట 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి మర్రి రవి కుమార్  విజయం
►21వ వార్డులో  పోలా రమణా రెడ్డి వైఎస్సార్‌సీపీ విజయం

10:02AM
గురజాల 
►నగర పంచాయతీలో 2 వార్డు లో 377 మెజార్టీ వైసిపి గెలుపు
►గురజాల 15వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన్యం కన్యాకుమారి 101 ఓట్లతో గెలుపు

10.02AM:
చిత్తూరు జిల్లా:
►కుప్పం 1,2,7 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

9:50AM
గుంటూరు:

►దాచేపల్లి 13వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వందనపు లక్ష్మి 159 ఓట్లమెజార్టీతో గెలుపు
►దాచేపల్లి 6వ వార్డు టీడీపీ అభ్యర్థి 94 ఓట్లతో గెలుపు
►గురజాల ఒకటో వార్డువైఎస్సార్‌సీపీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్లతో గెలుపు

►అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ లోని 17వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం
►18 వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నందిని విజయం

9:45 AM
అనంతపురం: 
►పెనుకొండ నగర పంచాయతీ లో వైఎస్సార్ సీపీ బోణీ
►14, 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఆధిక్యత

వైఎస్సార్ జిల్లా.. కమలాపురం
►17 వార్డు వైసీపీ అభ్యర్థి కలవ నాగమణి  27 ఓట్ల మెజార్టీతో విజయం

వైఎస్సార్ జిల్లా.. కమలాపురం
►9 వార్డు లో వైసీపీ అభ్యర్థి మారుజోళ్ళ శ్రీనివాసులు రెడ్డి 42 ఓట్లతో విజయం..
►10 వార్డులో వైసీపీ అభ్యర్థి గెంటెమ్ సుగంధి 81 మెజార్టీతో విజయం..

వైఎస్సార్ జిల్లా.. కమలాపురం
►16 వార్డు వైసీపీ అభ్యర్థి కొప్పు షాహీనా బేగం 144 ఓట్లతో విజయం

9.40AM
వైఎస్సార్ జిల్లా

►కమలాపురం మునిసిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం

09:22AM
చిత్తూరు జిల్లా 
►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు.
►14వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మునిస్వామి ఏకగ్రీవ ఎన్నిక
►నగిరి మున్సిపాలిటీ 17వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గంగాధరం ఏకగ్రీవం 

09:14AM
బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో వార్డుల వారీగా పార్టీలకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు
మొత్తం పోస్టుల బ్యాలెట్ లు - 114 
వైఎస్సార్‌సీపీ - 66
టీడీపీ - 20
బీజేపీ - 27
సీపీఎం - 1

వైఎస్సార్ జిల్లా
►కమలాపురం 11 వార్డులో 83 ఓట్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొప్పోలి సలీల విజయం
►కమలాపురం 15వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం

08:44AM
గుంటూరు జిల్లా
►ప్రారంభమైన గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
►ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన అధికారులు
►ఓట్లను కట్టలు కడుతున్న అధికారులు

08:40AM
నెల్లూరు జిల్లా
►ప్రారంభమైన కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ 
►పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కస్తున్న సిబ్బంది

08:37AM
తూర్పుగోదావరి జిల్లా
►కాకినాడ నగరపాలక సంస్థ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
►3,9,16,30. డివిజన్లకు ఈ నెల 15 న జరిగిన పొలింగ్
►మొత్తం 15 మంది అభ్యర్ధులు పోటి, 51.46 % పోలింగ్ నమోదు
►రంగరాయ మెడికల్ కళశాలలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు
►8 టేబుళ్ళు ఏర్పాటు, మధ్యహన్నం కల్లా వెలువడనున్న ఫలితాలు

08:31AM
ప్రకాశం జిల్లా
►దర్శి నగర పంచాయతీకి సంబంధించి ఏపీ మోడల్ స్కూల్‌లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం..
►19 వార్డులకు కౌంటింగ్ కోసం 38 టేబుల్స్ ఏర్పాటు
►100  మంది సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు

08:21AM
కృష్ణా జిల్లా
►తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లు 
►స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలింపు 
►మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కట్టనున్న కౌంటింగ్ సిబ్బంది 
►తొలిఫలితం 11 గంటలకు తెలిసే అవకాశం 
►16 టేబుళ్ల పై కౌంటింగ్ 
►రెండు రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్ 
►ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్న పోలీసులు 
►కౌంటింగ్‌కు పకడ్భందీ చర్యలు.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు

08:17AM
కర్నూలు జిల్లా
►ప్రారంభమైన బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలకు  కౌంటింగ్
►మొత్తం 20 వార్డులకు సంబంధించి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
►20 వార్డులకు గాను 20 టేబుళ్ల ఏర్పాటు
►ఒకటే రౌండ్‌లో ముగియనున్న ఓట్ల లెక్కింపు.
►11 గంటలలోపే వెలువడనున్న ఫలితాలు

08:10AM
చిత్తూరు జిల్లా
►కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం 
►పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మూడుకు గానూ ఒక్కటి కూడా నమోదు కాలేదు.

08:00AM
నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది.

సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక సోమవారం జరిగిన పోలింగ్‌లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 



ఉ.8 గంటలకు లెక్కింపు ప్రారంభం
ఓట్ల లెక్కింపు బుధవారం ఉ.8 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. సా.5 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 23 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 3,792 మందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్‌లు ఉండగా ఏకగ్రీవమైన 8 డివిజన్‌లు పోను మిగిలిన 46 డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు సమకూర్చారు. 

లెక్కింపు ప్రక్రియ చిత్రీకరణ
ఇక అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నీలం సాహ్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోని పోలింగ్‌ ప్రక్రియను చిత్రీకరించినట్లు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో పోలింగ్‌ స్టేషన్‌ల వెలుపల చిన్నచిన్న ఘటనలు మినహా, పోలింగ్‌ ప్రక్రియ అంతా సజావుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, ఇతర అధికారుల నుంచి నివేదికలు అందాయన్నారు. అన్ని పార్టీల పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలోనే పోలింగ్‌ జరిగిందని.. రీపోల్‌ నిర్వహించాలన్న వినతులు అందలేదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement