బెంగాల్ లో ముగిసిన రెండో దశ పోలింగ్
అలీపురుందర్, జల్పౌగురి,నార్త్ దీనాజ్ పూర్, సౌత్ దీనాజ్ పూర్, డార్జీలింగ్, మాండ్లా జిల్లాల్లో పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం మేరకు దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. ఈ రోజు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. 33 మంది మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 383 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.