రుణమాఫీలో లబ్ధిదారుల జాబితాను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటి కే రెండుసార్లు లబ్ధిదారుల ఎంపికను సమీక్షించిన అధికారులు తాజాగా ప్రత్యేక బృందాలతో కొన్ని బ్యాంకులను ఎంపిక చేసుకుని పరిశీలన చేయనున్నారు. ఈ క్రమంలో అవకతవకలు బయటపడితే మరింత లోతుకు వెళ్లి అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈనెల 30లోగా పరిశీలన పూర్తిచేసి నివేదికలను ప్రభుత్వానికి సమ ర్పించేలా చర్యలు చేపట్టారు. మొదటిసారి చేసిన క్షేత్రపరిశీలనలో 3,936 మంది రైతులను అనర్హులుగా గుర్తించిన అధికారులు.. ఈ సారి ఎంతమందిని గుర్తిస్తారో చూడాలి.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో రుణమాఫీ పథకంతో 2,08,425 మంది రైతులు లబ్ధి పొందారు. వాస్తవానికి మొదటిసారి ఎంపిక చేసిన సమయంలో 2,12,361 మంది రుణమాఫీకి అర్హత సాధించారు. అయితే క్షేత్రపరిశీలనకు ఉపక్రమించిన అధికారులు 3,936 మంది అనర్హులున్నట్లు గుర్తించి.. ఆ మేరకు వారికి ఇచ్చే మాఫీని వెనక్కు తీసుకున్నారు. దీంతో తొలివిడత రూ.258.16 కోట్లు మంజూరుకాగా.. లబ్ధిదారులకు మాత్రం రూ.251.20 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగతా నిధులను ప్రభుత్వానికి వెనక్కు ఇచ్చారు. తాజాగా లబ్ధిదారుల స్థితిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
10 శాతం పరిశీలన..
ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి లబ్ధిదారులందరి వివరాలను పరిశీలించడం సులభం కాదు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటుచేసి ర్యాండమ్‌గా పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు అధికారులు, ఆడిట్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులున్న బ్యాంకులను ఎంపిక చేసుకుని.. 10శాతం లబ్ధిదారులు కవర్‌అయ్యేలా పరిశీలన చేయనున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు తేలితే వారి అర్హతను రద్దు చేయనున్నారు. ఈమేరకు గురువారం సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కలెక్టర్ రఘునందన్‌రావును ఆదేశించారు. ఈ నివేదికలు సమర్పించిన తర్వాతే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
‘మాఫీ’పై పేచీ!
Published Fri, Jun 19 2015 12:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement