రేపట్నుంచి మోదీ రెండో విడత ప్రచారం | narendra Modi to campaign in Jammu Friday | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి మోదీ రెండో విడత ప్రచారం

Published Thu, Nov 27 2014 10:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

narendra Modi to campaign in Jammu Friday

జమ్మూ:జమ్మూ కాశ్మీర్ రెండో విడత ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి ఎన్నికల ర్యాలీలో పాల్గొనబోతున్నట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. పూంచ్, ఉదమ్ పూర్ జిల్లాలో మోదీ ప్రచారం నిర్వహిస్తారని..ఈ ర్యాలీలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 22 వ తేదీన నరేంద్ర మోదీ కిస్త్ వార్ పట్టణంలో జరిగిన ర్యాలీకి నలభై వేలమందికి పైగా ప్రజలు హాజరయ్యారని.. రెండో విడతలో అంతకంటే అధిక సంఖ్యలో తమకు ప్రజా మద్దతు లభిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement