ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ | Be ready for polls at all times, says Modi | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ

Published Sat, Mar 25 2017 9:30 AM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ - Sakshi

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం గుజరాత్‌, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల గురించి ఆయన చర్చించారు. ఇంతకుమునుపు ఉత్తరప్రదేశ్‌ ఎంపీలతో ప్రధాని మోదీ ఇదేవిధంగా భేటీ అయి.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, పార్టీ పనితీరు గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

శుక్రవారం ఉదయం గోవా, అండమాన్‌ నికోబార్‌ దీవులు, డామన్‌ డయ్యు ఎంపీలతోనూ ప్రధాని మోదీ అయ్యారు. అయితే, ప్రధానంగా గుజరాత్‌, రాజస్థాన్‌ ఎంపీలతోనే చర్చించినట్టు తెలిసింది. ఎంపీలంతా ఎన్నికలకు సదా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎల్లప్పుడూ ఎన్నికల మూడ్‌తో పనిచేయాలని, కేంద్ర, రాష్ట్రాలు ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం  కృషి చేయాలని ప్రబోధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement