స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులు..!
సాక్షి, గుంటూరు : ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వాలంటే ప్రజలు ఎన్నుకోవాలి. మార్కెట్ వంటి సంస్థలకు చైర్మన్‌గా నియమితులు కావాలంటే సంబంధిత శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాలి. కానీ చిలకలూరిపేటకు చెందిన ఓ అధికార పార్టీ నేత, నరసరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులకు ఇవేమీ అవసరం లేదు. వారి పదవులను వారే ప్రకటించుకున్నారు.
చిలకలూరిపేట నేత తన స్కార్పియో వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని దర్జాగా తిరుగుతుండగా, నరసరావుపేట చెందిన నేత ఏకంగా తన ఇన్నోవా వాహనం వెనుక నంబరు ప్లేట్‌కు ఏఎంసీ చైర్మన్ అంటూ స్టిక్కర్ వేసుకుని దర్పం ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు గానీ, రవాణాశాఖ అధికారులు గానీ ఇవి కనిపించకపోవడం విశేషం.