
సమన్వయంతో పనిచేయండి
♦ ఇంకుడు గుంతలను విరివిగా నిర్మించాలి: మంత్రి
♦ తాగునీటి సమస్యను రానివ్వంరాష్ట్ర నీటిపారుదల శాఖ
♦ మంత్రి హరీశ్ రావు ప్రజాప్రతినిధులు,
♦ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ తెలంగాణలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరువు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిష్టాత్మకం గా తీసుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, ఉపాధి హామీ, మిషన్ కాకతీయ పనులు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై మంత్రి హరీశ్ మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందు లో కలెక్టర్ రోనాల్డ్ రాస్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న నెలన్నర రోజు లు చాలా కీలకమైనవని, ఈ రోజుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బోరు బావులను అద్దెకు తీసుకొని నీటిని అందించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టుకుందాం..
ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. వ్యక్తిగత, కమ్యూనిటీ, ఇన్‌స్టిట్యూట్, ఇంకుడు గుం తల నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసిం దన్నారు. రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, మెదక్ నియోజకవర్గం మొదటి స్థానంలో, ఖేడ్ చివరి స్థానంలో ఉందన్నారు. ఎంపీడీఓలు యువజన, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఉత్సాహవంతమైన మండల సమాఖ్యకు లక్ష రూపాయల బహుమతి అందజేస్తామన్నారు. మండలంలో వందశాతం నిర్మించిన వాటికి రూ.10 లక్షల ఇన్సెంటివ్, రెండో స్థానంలో ఉంటే రూ.5 లక్షలు, మూడో స్థానంలో నిలిస్తే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందజేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 11,485 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయిందన్నారు. ఉపాధి కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించని ఏపీడీ, ఏపీఓలపై చర్యలు తప్పవని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.
మిషన్ కాకతీయను వేగవంతం చేయండి...
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ కాకతీయ పనులను నాణ్యత, క్యూరింగ్ తో సకాలంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. రెండో విడతలో జిల్లాకు 1,679 పనులు మంజూరు కాగా వెయ్యి పనులే ప్రారంభమయ్యాయని, మిగతా పనులు వారం రోజుల్లోగా ప్రారంభించాలన్నా రు. సమీక్షలో ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, రామలింగారెడ్డి, బాబూమోహన్, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జేసీ వెంకటరామిరెడ్డి, జెడ్పీ సీఈఓ వర్షిణి, ఏజేసీ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ దయానంద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.