కరువు ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు
2018లో యాదాద్రి జిల్లాకు గోదావరి జలాలు
► యుద్ధ ప్రాతిపదికన గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు
► కొత్త చట్టం ప్రకారం వేగంగా భూసేకరణ
► కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు మళ్లించే ధ్యేయం తో ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. అందుకే కరువు ప్రాంతమైన యాదాద్రి జిల్లాలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. 2018 జూలైలో కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు యాదాద్రిజిల్లాలో ప్రవహిస్తా యని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనుగు ణంగా అధికారులు నిర్మాణ, భూసేకరణ పనులు చేపట్టాలని సూచించారు.
సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు సంబం ధించి పలు కీలక సూచనలు చేశారు. పెద్దప ల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో గతేడాది అమలు చేసిన’ టెయిల్ టు హెడ్’ విధానాన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్నారు. ఈ విధానం మధ్యప్రదేశ్‌లో విజయవంతమైంద ని, ఈ నేపథ్యంలో వీలైనన్ని ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టాలని సూచించారు. సవరించిన 2016 భూసేకరణ చట్టం ప్రకారం సాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రతీ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టు లక్ష్యాల సాధనకు పకడ్బందీ గా ప్రణాళికలు రచించి అమలు చేయాలన్నా రు.
మిడ్‌మానేరు, పులిచింతల తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కాలనీలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవా లని సంబంధిత ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో గతేడాది అత్యధికంగా 4లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండిందని, ఇందుకు కృషి చేసిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను మంత్రి అభినందించారు. సీతారామ ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు వేగవం తం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరం పూర్తి ఆయ కట్టుకు నీరివ్వాలని సూచించారు.
నీటి విడుదలకు ఆదేశాలు..
సింగూరు, ఘనపురం, కడెం, నీల్వాయి, మత్తడివాగు, కొమురంభీమ్, గొల్లవాగు, నల్ల వాగు ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌లో నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకో వాలని హరీశ్ సూచించారు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, ఏఎంఆర్‌పీ, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో వెంటనే ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రైతు అవగాహన సదస్సులు వెంటనే నిర్వహించాలని ఆదేశించారు.
వివిధ ప్రాజెక్టుల డ్యామ్‌ల గేట్లను పటిష్టం చేయాలన్నారు. నిజాంసాగర్ కింద గత ఏడాది సమర్థంగా సాగు నీటి యాజ మాన్యం జరిగిందని, అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్టుల్లోనూ కొనసాగించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్సులో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈఎన్‌సీ మురళీధర్, విజయప్రకాశ్, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, సీఈలు హరిరామ్, ఖగేందర్‌రావు, సుధాకర్, శ్యామసుందర్, సురేశ్, మధుసూదన్, అనిల్, సునీల్, భగవంతరావు తదితరులు పాల్గొన్నారు.
కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన మంత్రి హరీశ్
తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు సోమవారం జలసౌ ధలో ప్రారంభించారు. ఇస్రో సాయంతో నీటి పారుదల శాఖ 55 ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు, కాల్వలు, పిల్ల కాల్వల వ్యస్థను డిజిటలైజ్ చేయగా, ఆ సమాచారాన్ని అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తంగా 22,784 కిలోమీటర్ల పొడవైన 8,177 కాల్వల వివరాలను ఇందులో పొందుపరిచారు. వీటితో పాటే 46 వేల చెరువుల సమాచారాన్ని పూర్తిగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.