ఆగని కొత్త జిల్లాల నిరసనలు | Incessant new districts Protests | Sakshi
Sakshi News home page

ఆగని కొత్త జిల్లాల నిరసనలు

Published Mon, Oct 10 2016 12:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

ఆగని కొత్త జిల్లాల నిరసనలు - Sakshi

ఆగని కొత్త జిల్లాల నిరసనలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు జిల్లా సాధన

నారాయణపేట/కొడంగల్ రూరల్: మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు జిల్లా సాధన సమితి, అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆదివారం నిరసనలు చేపట్టారు. పతంజలి యోగాసమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో ఉదయం ఉద్యమకారులు యోగాసనాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. నారాయణపేటను జిల్లాగా ప్రకటించే  వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని డప్పులు, డోళ్ల చప్పుళ్లతో జిల్లా వాదన వినిపించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని విడదీయకూడదని, మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలని తాండూర్- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారి పర్సాపూర్ గేటుపై పర్సాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్- కర్ణాటక రహదారి యాద్గిర్, గుల్బర్గా ప్రధాన రహదారిపై రావులపల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

 నల్లగొండలోనూ విభజన సెగ
 నల్లగొండ: విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుండాల మండలాన్ని యాదాద్రిలోనే ఉంచాలని ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. మోటకొండూరును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని యాదగిరిగుట్టలో ప్రజాప్రతినిధులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మేళ్లచెర్వు మండలం దొండపాడును మండలంగా చేయాలని రాస్తారోకో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement