గడప గడపనా సందడి.. | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గడప గడపనా సందడి..

Published Tue, May 31 2022 5:00 AM | Last Updated on Tue, May 31 2022 10:41 AM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over Andhra Pradesh - Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ 63వ డివిజన్‌లో స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఊరూరా మంచి స్పందన కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తోన్న పథకాలను వివరించారు. బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు.

సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచించారు. ఇకపై కూడా ఇదే రీతిలో సంక్షేమాభివృద్ధి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలోనూ తాము ఇంతగా లబ్ధి పొందలేదని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement