నవీ ముంబై కమిషనర్ ముండే (మైక్‌తో)
విశ్లేషణ
రాజకీయాలు, అక్రమార్జన కోసం రాజకీయం చేయడం పౌర జీవితం పాలిట శాపం. అవి నగరాలను, పట్టణాలను జీవింపశక్యం కానివిగా చేశాయి. అక్రమ నిర్మాణాలు, అధ్వానమైన రోడ్లు వగైరాలు ఈ అనర్థాన్ని కళ్లకు కడుతుంటాయి.
కొత్త నవీ ముంబై కమిషనర్‌గా నియమితులైన తుకారాం ముండే ఉదయం నడకకు వెళ్లిన ప్పుడు పౌరులు తమ సమస్యలు వినిపిస్తూ ఉంటే నిర్ఘాంతపో వాల్సి వచ్చింది. అధ్వానమైన ఫుట్‌పాత్‌లు, బస్సు సర్వీసులు, నీటి సరఫరా, మురుగు కాలు వలు, చెత్త, మురికివాడలు వగైరా... వారు ఏకరువు పెట్టిన సమస్యలను వార్డు కార్యాలయాలకు లేదా కార్పొరేటర్ల ద్వారా కార్పొరేషన్‌కు చెబితే సరిపోతుంది.
కానీ ఎక్కడో ఏదో తప్పు జగిందని అనిపిస్తోంది. ఒకటి, కార్పొరేషన్ ఆ నగరం కోసం లేదా నగర పౌరుల కోసం పనిచేయడం లేదు. ప్రజలకూ, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు మధ్య బంధం తెగిపోయింది. స్థానిక ఎన్నికల్లో నగరం పట్ల చిత్తశుద్ధికి తప్ప భావజాలానికి తావు లేదు. అయినా ప్రజా ప్రతినిధులు వచ్చే మునిసిపల్ ఎన్ని కల్లో నగర సంక్షేమంపైగాక, తమ భావజాలంపై ఆధారపడి ఓట్లు అడుక్కోవడమో లేక కొనుక్కోవడమో చేస్తారని అనిపిస్తోంది. కాబట్టే ముండే రోజువారీ కాలి నడక కాస్తా అధికారిక విధుల్లో భాగంగా మారిపోయింది.
పౌర సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన చర్యలు ఓ అరుదైన పర్యవసానానికి దారి తీశాయి. గత వారంSకమిషనర్‌పై విశ్వాస రాహిత్య తీర్మానానికి అను కూలంగా 104 మంది కార్పొరేటర్లు ఓటు చేయగా, ఆరు గురు మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు. ఈ తీర్మా నాన్ని ఆమోదించడంలో అన్ని రాజకీయ పార్టీల కార్పొ రేటర్లు ఒక్కటయ్యారు. అయినా, ఈ తీర్మానం ప్రజాస్వా మిక సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన చర్య అనే వాదనను అంగీకరించను. ఇది నిజానికి, నగర కమిషనర్లు, రాజకీయ వేత్తలు కుమ్మక్కయ్యే తమ పద్ధ్దతుల పరిరక్షణ కోసం చేప ట్టిన చర్య మాత్రమే.
ఎనిమిదేళ్ల కంటే తక్కువ కాలంలోనే ఎనిమిది బది లీలను చూసిన కర్తవ్యదీక్షాపరుడైన ఐఏఎస్ అధికారి ముండే... ఈ వ్యవహారం అంతటికీ మూలం ఏమిటనే దాన్ని పట్టుకున్నారు. నిర్దిష్టంగా కేటాయింపులు లేకుండా, స్థూల పద్దుల కింద రూ. 2,000 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. తద్వారా కార్పొరేటర్లకు అనువైన రీతిలో నిధుల మళ్లింపునకు వీలుండేలా చేశారు. మునిసిపల్ చట్టాల ప్రకారం కమిషనర్∙పరిపాలకుడు మాత్రమే, ఇక మేయర్లది నామ మాత్రపు పాత్రే. ముండే నగర పాల కునిగా తన అధికారాలను ఉపయోగించసాగారు.
ఐదు నెలల్లో మిన్ను విరిగి మీద పడింది. ఒక స్మారక చిహ్నానికి చలువరాతి తాపడం చేయడానికి రూ. 2 కోట్ల ప్రణాళిక అనవసరమంటూ దాన్ని రద్దు చేశారు. రూ. 167 కోట్ల సోలార్ పార్క్ విషయంలోనూ అదే పని చేశారు. కొను గోలుదారు ఎవరూ లేకుండా దాన్ని చేపట్టడమే అందుకు కారణం. ఆ ప్రాజెక్టు ప్రణాళికలో కొనుగోలుదా రుని వెతికే అంశం సైతం లేదు. కచ్చితమైన చర్యలను చేపట్టడంతో పక్కనే ఉన్న ముంబైలో మునిసిపల్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడిన దృష్ట్యా ముండే కొరతగా ఉన్న నిధులను పౌర సదుపాయాలకు మళ్లించాలని నిర్ణ యించారు.
పురపాలక సంస్థలు స్థానిక స్వయం పరిపాలనా సంస్థలు. కాబట్టి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కన పెట్టేయడం ప్రజాస్వామ్యంలో జరగదగినది కాదు. కానీ, నగరాన్ని, నగర అవసరాలను తక్కువ ప్రాధాన్యం గలవిగా చూడటం ద్వారా కార్పొరేటర్లు తమంతట తామే ఆ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. వారు అతిశయాన్ని నేర్చుకున్నారు. తమ నగరానికి సేవ చేయాలనే నిబద్ధతకు బదులుగా తమకు అనువైన ప్రత్యేక ప్రయోజన బృందా లను ఏర్పరచుకున్నారు. చాలా ఇతర నగరాలలో కూడా నవీ ముంబై కనిపిస్తుండటం విచారకరం.
ముండేపై విశ్వాస రాహిత్య తీర్మానాన్ని కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఆమోదించకపోవడం, కమిషనర్‌ను మార్చడం జరగకపోవచ్చని సంకేతించడం సంతోష కరం. మునిసిపల్ చట్టాన్ని అనుసరించి కమిషనర్‌ను నియ మించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఎవరిని నియమిస్తారు, ఎంత కాలానికి అనే వాటిని నిర్ణయించేది నగర పాలక సంస్థ కాదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పట్ల ‘‘గౌరవం’’తో ఉండాలని మాత్రమే ముండేకు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా నగరంపై ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తుండటం వల్ల కార్పొరేటర్ల అహాలు తునాతునకలై పోయాయి.
మహారాష్ట్రలో ఇంతకు ముందు కూడా కొందరు కమి షనర్లు ముండేలాగానే ప్రజాప్రతినిధులతో ఘర్షణ పడాల్సి వచ్చింది. కార్పొరేటర్లను దూరంగా ఉంచి నిబంధనల ప్రకారం ముంబై కమిషనర్‌గా పనిచేసిన సదాశివ తినాయ్ కార్, పుణెకు సంబంధించి అరుణ్ భాటియా అలాంటి వారే. టీ చంద్రశేఖర్‌కు థానే నగరం కోసం పని చేసినం దుకు విశ్వాస రాహిత్య తీర్మానం బహుమతిగా దక్కింది.
రాజకీయాలు, అక్రమార్జన కోసం రాజకీయం చేయడం పౌర జీవితం పాలిట శాపం. అవి నగరాలను, పట్టణాలను జీవింపశక్యం కానివిగా చేశాయి. అక్రమ నిర్మా ణాలు, అధ్వానమైన రోడ్లు వగైరాలు ఈ అనర్థాన్ని కళ్లకు కడుతుంటాయి, అనుభవంలోకి తెస్తుంటాయి. నగర పాలక సంస్థ లక్ష్యాల ప్రాధాన్యాలను మార్చడమే ముండే చేసిన తప్పు. అంతే. ఇది, ‘ప్రజలు ఎన్నుకున్న ప్రతి నిధులకు గుణపాఠం’.
( వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు mail : mvijapurkar@gmail.com)