విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు. సీపీఐ తరఫున ఆయన చింతపల్లి నియోజకవర్గం నుంచి 1994, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేముడు అంత్యక్రియలు మండలంలోని శరబన్నపాలెంలో జరుగనున్నాయి.