demudu
-
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
ఆ ఐదేళ్లూ మా బతుకుల్లో సంక్షేమాన్ని చూశా..
సాక్షి, విశాఖ సిటీ : ఆమె స్వచ్ఛమైన గిరిజనాలకు ప్రతీక. కల్మషం లేని మనుషుల మధ్య పెరుగుతూ.. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాలకనుగుణంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. తండ్రి మూడుసార్లు ఎమ్మెల్యే అయినా.. ఇసుమంత అహం లేని వ్యక్తిత్వంతో గిరిజనుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ.. వైఎస్ హయాంలో ఆ కొండకోనల్లో జరిగిన అభివృద్ధిని మళ్లీ చూడాలన్న కాంక్షతో జగనన్న బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆమె.. 26 ఏళ్ల గొడ్డేటి మాధవి. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థి అనుభవమంత వయసులేకపోయినా ఆ బినామీ కొండను ఢీకొట్టి.. గిరిజనుల జీవితాల్లో కొత్త శకానికి నాందిపలుకుతానంటున్నారు. గిరిజనాల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె తనకేమాత్రం ప్రత్యర్థులు కారని, అరకు నియోజకవర్గ సమస్యలే అసలైన ప్రత్యర్థులని, వాటిపై విజయమే లక్ష్యమంటున్న మాధవి అంతరంగం ఆమె మాటల్లోనే... జగనన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. సాధారణ గిరిజన మహిళగా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. గిరిపుత్రుల కష్టాలు చూస్తూ పెరిగిన నాకు ఎప్పటికైనా వారికి సాయపడాలనే తపన తీవ్రంగా ఉండేది. అందుకు రాజకీయాల్లోకి రావడమే మార్గమని గుర్తించాను. మా నాన్న దేముడు ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆయన నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక 2017 నుంచి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినిగా చేస్తున్న నన్ను గుర్తించి, తోటి గిరిజనులకు సాయపడాలనే నా ఆకాంక్షను తెలుసుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి అరకు టిక్కెట్ కేటాయించారు. ఆ విషయం తెలియగానే తీవ్ర ఉద్వేగానికి గురయ్యాను. గిరిజన మహిళలను అత్యున్నత పదవిలో చూడాలన్నదే తన లక్ష్యమని పాదయాత్ర సమయంలో జగనన్న చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గిరిపుత్రులపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎలాంటి వాత్సల్యం చూపించారో.. అదే అభిమానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి చాటుకున్నారు. నాపై పూర్తి విశ్వాసముంచి టిక్కెట్ ఇచ్చినందుకు ఆయన నమ్మకాన్ని నిలబెడతాను. నాకు టికెట్ దక్కగానే.. మూడు రోజుల నుంచి నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్నప్పుడు వారి కష్టార్జితంలోంచి రూ.200, రూ.500 చేతిలో పెడుతూ ఎన్నికల ఖర్చులకు అవసరమవుతాయమ్మా.. అంటూ దీవిస్తున్నారు. ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి. ఇదంతా జగనన్న ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెడతాను. విజయాన్ని కానుకగా ఇస్తాను. ఇంటర్‌లోనే నాపై రాజన్న ముద్ర గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన నా జీవితంపై బలమైన ముద్రవేసింది. ఆ సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. ఆయన సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో ఎందరో బతుకులకు దారి చూపాయి. అందరికీ విద్య, వైద్యం అందడం చూసి ప్రజా సేవ చేయాలనే నా కోరిక బలపడింది. ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలోనే తప్ప ఎప్పుడూ మా అరకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి జరిగింది లేదు. చదువుకోడానికి సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. వైద్య సదుపాయాలు లేక ఎందరో కళ్లముందే ప్రాణాలు విడిచేవారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మా బతుకులు బాగుపడ్డాయి. 108 వాహనం మా గిరిపుత్రుల ఆయుష్షు పెంచింది. ఆయన మరణానంతరం మళ్లీ అభివృద్ధి పడకేసింది. ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగనన్న పడుతున్న కష్టం చూసి నేను కూడా గిరిజనులకు ఏదొకటి చేయాలని నిర్ణయించుకున్నాను. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని అర్థమయ్యాక వైఎస్సార్సీపీ పార్టీలో చేరి గిరిజన ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నాను. మా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, సంక్షేమం.. అందుకే నా పోరాటం నాన్న మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. నేను చాలా సాధారణ జీవితమే గడిపాను. ప్రజాసమస్యల పరిష్కారానికి నాన్న చేసిన కృషి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. రాజకీయాల్లోకి వచ్చే ముందు.. నాన్న స్నేహితులు, బంధువులు, ప్రజలు సమావేశమై జగనన్నతో నడవమని సూచించారు. ఆ దిశగా అడుగులు వేశాను. జగనన్న నాపై పూర్తి నమ్మకముంచి ఈ బాధ్యత అప్పగించారు. నేను సమస్యల్లో నుంచి వచ్చాను. వాటన్నింటినీ పరిష్కరించాలి. మా ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం. ఏజెన్సీలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి.. అన్ని వేళలా పూర్తిస్థాయి వైద్యం అందించాలనుకుంటున్నాను. నాణ్యమైన విద్యను అందిస్తే.. గిరిజనుల్లో చైతన్యం వస్తుంది. ఏజెన్సీలో మాతా శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికీ ఆ తరహా మరణాలు ఆగలేదు. ఈ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తే చాలు.. మన్యంలో మనసున్న మారాజు రాజన్న పాలన మరోసారి వస్తుంది. దాని కోసం రేయింబవళ్లూ కృషి చేస్తాను. డబ్బే ప్రధామనుకుంటే నాకు టిక్కెట్ దక్కేదా? ఈ ఎన్నికల్లో అంగ, అర్థబలమున్న వైరిచర్లను ఢీకొట్టగలరా? అని అడుతున్నారు. డబ్బే ప్రధానమని అనుకుంటే.. జగన్మోహన్రెడ్డి గారు సామాన్యురాలైన నాకు టిక్కెట్ ఇచ్చేవారా.? మా నాన్న దేముడు 1994 నుంచి 2004 వరకూ ఎమ్మెల్యేగా విజయం సాధించేవారా.? అని వారికి సమాధానం చెబుతున్నాను. డబ్బుకంటే.. ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే ప్రధానం. ఎన్నికల్లో అదే ఆయుధం. గిరిజన గుండెల్లో రాజన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో జగనన్న కూడా నడుస్తున్నారు. ఆ రెండే నా బలం. మా ప్రజలు డబ్బు ఇచ్చినా తీసుకునే స్థితిలో లేరు. వారికి కావల్సిందల్లా మౌలిక వసతులు. నా ఏకైక లక్ష్యం అదే మా నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న వ్యక్తి చేయలేనిది చేసి చూపించాలనే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు తెలిసినంత వరకూ నా ప్రత్యర్థి ఒక్కరే. మా అరకు నియోజకవర్గ సమస్యలే నా అసలైన ప్రత్యర్థులు. ఆ సమస్యలపై విజయమే నా ముందున్న ఏకైక లక్ష్యం. 30 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాననే గొప్ప చెప్పుకోవడమే తప్ప.. టీడీపీ అభ్యర్థి వైరిచర్ల ఏనాడైనా అరకు ప్రజల సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించారా? సమస్యలు పరిష్కరించేందుకు కనీసం కృషి చేశారా.? ఏమీ చేయలేదు. ఆయన హయాంలో ఏదైనా అభివృద్ధి జరిగితే.. నేనిలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చి ఉండేది కాదేమో. ఆయన ఎవరో కూడా పాడేరు, రంపచోడవరం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ తెలీదు. టీడీపీలోకి వెళ్లినా, కాంగ్రెస్ వారసత్వాన్ని పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే కుమార్తెను కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారు. – కరుకోల గోపీకిశోర్‌రాజా -
వైఎస్ జగన్‌ను కలిసిన ఇరిగేషన్ రిటైద్ డీఈ దేముడు
-
మావోయిస్టులపై విమర్శలు చేసిన ఏకైక నేత
కొయ్యూరు: గన్మేన్లు వద్దని ప్రభుత్వానికి లేఖ రాసిన మొదటి ఎమ్మెల్యే దేముడే..నిజాయతీకి ఆయన మారుపేరు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినా సంపాదించింది ఏమి లేదు. సామాన్యుడిలా పెంకుటింటిలోనే నివసించారు. భార్య చెల్లయ్యమ్మ శరభన్నపాలెంకు కిలోమీటరు దూరంలో ఉన్న కంపరేగులలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె జీతంతోనే ఇల్లు గడిచింది. వచ్చే పెన్షన్‌తోనే మన్య మంతటా తిరిగారు. గిరిజన సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం సాగించారు. ఏ పార్టీ నేతలైనా అవసరమైతే పోలీసులపై ఆరోపణలు చేస్తారు తప్ప మావోయిస్టులపై ఎలాంటి ప్రకటనలు చేయరు. దేముడు అలా కాదు. చేసింది తప్పు అనిపిస్తే మావోయిస్టులయినా సరే విమర్శలు గుప్పించేవారు. చేస్తున్నది తప్పని కచ్చితంగా ఎత్తి చూపేవారు. ఇటు పోలీసుల చర్యలను కూడా ఆయన అదే విధంగా తప్పుబట్టేవారు. ఇటీవల కేజీహెచ్‌లో చికిత్స పొందుతూనే కొయ్యూరు విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. మావోయిస్టులు ముగ్గురు సాధారణ గిరిజనులను కిడ్నాప్ చేయడాన్ని ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో పోలీసులు బలపంలో గిరిజనులను పట్టుకుని ఓడిశాలో బీఎస్ఎఫ్ బలగాలకు అప్పగించడాన్ని తప్పుబట్టారు. సాగుల సంఘటనప్పుడు మావోయిస్టులు చేసింది తప్పని బహిరంగంగా విమర్శించారు. ప్రాణం పోసిన రాజశేఖరరెడ్డి 2009లో దేముడు ఆరోగ్యం క్షీణిస్తే ఆయనను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. ఆరోగ్యం మరింత క్షణించడంతో అతనిని వెంటనే విమానంలో హైదరాబాద్ తీసుకు వచ్చి నిమ్స్‌లో చేర్చి అప్పట్లో ప్రాణం కాపాడిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజేశేఖరరెడ్డికి దక్కుతుంది. అప్పట్లో దేముడు గుండెకు రంధ్రం పడడంతో స్టంట్ వేశారు. తరువాత దేముడు ఆరోగ్యం కుదుటపడింది. కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత నెలలో కేజీహెచ్‌లో చేరారు. -
మాజీ ఎమ్మెల్యే దేముడు కన్నుమూత
విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు. సీపీఐ తరఫున ఆయన చింతపల్లి నియోజకవర్గం నుంచి 1994, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేముడు అంత్యక్రియలు మండలంలోని శరబన్నపాలెంలో జరుగనున్నాయి. -
ఇద్దరు మత్స్యకారుల గల్లంతు
అచ్యుతాపురం : నాలుగు చేపలు ఎక్కువ పడతాయని ఆశతో పొట్ట చేతపట్టుకొని కాకినాడ తీరానికి వెళ్లారు. వేటలో జరిగిన అపశ్రుతి కారణంగా ఇద్దరు మత్స్యకారులు మంగళవారం గల్లంతయ్యారు. వారిపై ఆధారపడిన రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. దీంతో పూడిమడకలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. పూడిమడకకి చెందిన చోడిపల్లి దేముడు (40), గనగళ్ల తాతయ్య (45) రెండు వారాల కిత్రం వేటకు కాకినాడ తీరానికి వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే వేట సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం షిప్ వద్ద రెండు బోటులు వేట సాగిస్తూ ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటనలో మత్స్యకారులిద్దరూ గల్లంతయ్యారు. గురువారం సమాచారం తెలియడంతో పూడిమడకలో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. క డసారి చూపునకు కూడా నోచుకోలేదని గ్రామస్తులు దుఃఖించారు. దేముడికి భార్య రమణ, ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాతయ్యకి భార్య చెట్టెమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మత్స్య సంపద కోసం వలసబాట పూడిమడక తీరం నుంచి వేటాడే పడవల సంఖ్య పెరగడంతో చేపలు లభించడం లేదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మత్స్యసంపద తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆయిల్ ధర గిట్టుబాటు లేని పరిస్థితి ఉంది. కాకినాడ రేవుకి సమీపంలో లంగరువేసిన ఓడల సమీపంలో చేపలు చేరుతాయి. ఎక్కువ మొత్తంలో చేపలు పడతాయని ఆశతో ఇక్కడి నుంచి మత్స్యకారులు వలస వెళ్తున్నారు. ప్రస్తుతం 30 తెప్పలతో 200 మంది పూడిమడక జాలర్లు అక్కడే వేట సాగిస్తున్నారు. ఓడల చుట్టూ తిరుగుతూ వేటాడే క్రమంలో పడవలు ఢీకొని ప్రమాదం జరిగిందని మత్స్యకారులు తెలిపారు. -
భార్యను చంపి.. తనువు చాలించి..
వారిద్దరూ నవదంపతులు. కలకాలం అన్యోన్యంగా జీవించాల్సిన వారు. కుటుంబ తగాదాలతో వారి వివాహం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలు వివాహం జరిగిన ఏడాదికే వారిని అనంతలోకాలకు తీసుకుపోయాయి. భార్యను నరికి హత్య చేసిన భర్త తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేపాడ, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన వేపాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల కుటుంబీకులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన వాకాడ అప్పడు కుమారుడు దేముడు(23)కి వేపాడ శివారు బక్కునాయుడుపేట గ్రామానికి చెందిన కోన చిన్నమ్మతల్లి కుమారై బంగారమ్మ(20)కు గత ఏడాది మే 24న వివాహం జరిగింది. వివాహానంతరం కొద్దిరోజులు ఆ దంపతులు బాగానే ఉన్నారు. అనంతరం ఏడాదిలో రెండు పర్యాయాలు కుటుంబ తగాదాలతో కన్నవారింటికి బంగారమ్మ వెళ్లిపోవడం, కులపెద్దలు నచ్చచెప్పి తీసుకురావడం జరిగింది. పెద్దమనుషులు కుదిర్చిన రాజీ వల్ల ఈ నెల రెండోతేదీన బంగారమ్మ అత్తవారింటికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భర్త దేముడు ఆమెను కత్తితో మెడపైన. తలపైన నరికివేయడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది. దీంతో దేముడు భయాందోళనకు గురై చెరువులో స్నానం చేసి సమీపంలో ఉన్న రౌతు ఈశ్వర్రావు కళ్లంలో పశువులశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయాన్నే కోడలు బంగారమ్మను పిలిస్తే పలకలేదని, తలుపుతీస్తే రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు తీయించగా ఇంట్లో కోడలు రక్తపుమడుగులో ఉందని, కొడుకు కనిపించలేదని హతురాలి అత్త గెడ్డమ్మ తెలిపింది. కొంతసేపటి తర్వాత కొడుకు పశువుల శాల దగ్గర ఉరిపోసుకుని చనిపోయాడన్న సమాచారం తెలిసిందన్నారు. వీఆర్ఓ, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి హతురాలు బంగారమ్మ తల్లి కోన అచ్చమ్మ, మృతుడు దేముడు తండ్రి వాకాడ అప్పడు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్.కోట ఇన్చార్జి సీఐ కుమారస్వామి, ఎస్సై ఎస్.కె.ఎస్.ఘని కేసులు నమోదుచేసి దర్యాపు ప్రారంభించారు. వేపాడ ఇన్చార్జి తహశీల్దారు వై.బెంజిమన్, సీఐ. వీఆర్ఓ. పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు గుమ్మడి భారతి, నిరుజోగి ముత్యాలునాయుడు తదితరుల సమక్షంలో పంచనామా జరిపి మృతదేహాలను ఎస్.కోట ప్రభు త్వాస్పపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆస్తి కోసమే.. వాకాడ అప్పడు రెండో భార్య అయిన గెడ్డమ్మ ఆమెకు జన్మించిన కొడుకు బంగారునాయుడుకు ఆస్తి దక్కాలన్న ఉద్దేశంతో తన కూతురు,అల్లుడు మధ్య గొడవలు సృష్టించి ఇటువంటి దారుణానికి కారణమైందంటూ హతురాలి తల్లి అచ్చమ్మ, కుటుంబీకులు ఆరోపించారు. తన కూతుర్ని అత్తింటివారే పొట్టనటెట్టుకున్నారని అచ్చెమ్మ భోరున విలపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ సయ్యద్ఇషాక్ మహమ్మద్ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. అనంత రం వల్లంపూడి పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆయన హతురాలి కుటుంబీకులను, మృతుడు దేముడు తల్లిదండ్రులను విచారణ చేశారు.