అదుపు తప్పి పెళ్లిబృందం
లారీ బోల్తా
ఇద్దరి దుర్మరణం
మరో 32 మందికి తీవ్రగాయాలు
తక్కెళ్లపల్లి శివారులో ఘటన
పచ్చని తోరణాలు..బంధువుల సందడి.ఒకరినొకరి పలకరింపులు.. చిన్నారుల కేరింతలు.. ఆడపడుచుల అలంకరణలు.. ఇలా ఆ ఇంట్లో పండగవాతావరణం..కొన్ని గంటల్లో ఓ జంటను ఒక్కటి చేసేందుకు పెళ్లి బృందం సభ్యులంతా ఓ లారీలో బయలుదేరారు...పట్టుమని పది నిమిషాలు గడిచాయో లేదో.. ఈ లోపు పిడుగులాంటి వార్త.. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం
- చింతపల్లి
చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామ పంచాయతీ పరి ధి రోటిగడ్డతండాకు తౌర్యానాయక్ కుమారు డు ఇస్లావత్ నరేష్‌కు నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి తండాకు చెందిన సీతారామ్‌నాయక్ కుమార్తె అనుజతో బుధవారం ముష్టిపల్లిలో వివాహం జరగనుంది. ఆ వేడుకకు హాజరయ్యేందుకు పెళ్లికుమారుడి బంధువు లు తక్కెళ్లపల్లి నుంచి లారీలో బయలుదేరారు.
అదుపుతప్పి.. బోల్తాకొట్టడంతో..
తక్కెళ్లపల్లి నుంచి బయలుదేరిన పెళ్లిబృందం లారీ గ్రామ శివారులోకి రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తాకొట్టింది. దీంతో లారీలో ప్ర యాణిస్తున్న నేనావత్ బాష (62), నేనావత్ చావిలి (65) అక్కడికక్కడే మృతిచెందగా నేనావత్ జ్యోతి, నేనావత్ సోనా, నేనావత్ రంజిత, నేనావత్ అశోక్, కేతావత్ నాకో, ఇస్లావత్ బాలా, నేనావత్ సావుకార్, నేనావత్ కిష న్, ఇస్లావత్ నాన్కు, నేనావత్ జంగి, ఇస్లావత్ మహేష్, ఇస్లావత్ జంగి, ఇస్లావత్ గోవి ందు, ఇస్లావత్ లక్ష్మి, మెగావత్ సుప్రజ, ఇస్లావత్ బిచ్యా, ఇస్లావత్ అఖిల, ఇస్లావత్ కమ్లి, నేనావత్ జీజీ, నేనావత్ రెడ్డి, ఇస్లావత్ రుక్క మ్మ, నేనావత్ భూమిక, నేనావత్ సుప్రియ, సపావట్ లక్ష్మి, నేనావత్ జుమాని, నేనావత్ రాం చంద్ర, ఇస్లావత్ బుజ్జి, నేనావత్ కింగినా, నేనావత్ చక్రి, నేనావత్ చంటి, ఇస్లావత్ రా ములు, స్వప్నలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆహాకారాలు.. ఆర్తనాదాలు
పెళ్లి బృందం లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో అందులో ఉన్న వారు తలా ఒ దిక్కు ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలతో తమను రక్షిం చాలని కోరుతూ వారు చేసిన ఆర్తనాదాలకు స్థానికులు చలించిపోయారు. ప్రమాదం జరి గిందని తెలసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్య లో ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
కొంపముంచిన అతివేగం
వివాహానికి వెళ్తున్న డ్రైవర్ లారీని అజాగ్రత్తతతో, అతివేగంతో నడపడంతో ప్రమాదం చో టు చేసుకుందని క్షతగాత్రులు ఆరోపించారు. గ్రామం నుంచి బయల్దేరిన పది నిమిషాలకే అతివేగంతో ఉన్న లారీ తక్కెళ్లపల్లి గ్రామశివారులోకి రాగానే సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టిందన్నారు. ఇరుకు రోడ్డులోనూ అతివేగంగా వచ్చి ప్రమాదానికి డ్రైవరే కారణమయ్యాడని క్షతగాత్రులు వాపోయారు. రోడ్డుపై లారీ పడి ఉండటంతో వాహనాలు వెళ్లే దారి లేకపోవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇబ్బందులు ఎదుర్కొన్న క్షతగాత్రులు
ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులు మధ్యాహ్న సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతపల్లికి 108 ఒకటి మాత్రమే అందుబాటులో ఉండటంతో అందులో సుమారు 15 మందిని హుటాహుటీనా హైదరాబాద్‌కు తరలించినప్పటికీ ప్రమాదంలో గాయపడిన మరో 15 మంది వరకు అక్కడే పడి ఉన్నారు. దేవరకొండ 108కు సమాచారం అందించినప్పటికీ సమయానికి సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో క్షతగాత్రులు ఆటో, ట్రాక్టర్ ద్వారా పోలీసులు, బంధువులు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే సంతాపం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
తక్కెళ్లపల్లి గ్రామశివారులో ప్రమాదం చోటు చేసుకుందని విషయం తెలుసుకున్న చింతపల్లి ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డితో పాటు నాంపల్లి సీఐ ఈర్లపల్లి వెంకట్‌రెడ్డి, మర్రిగూడ ఎస్‌ఐ మురళి హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.