Larry roll
-
పెళ్లింట విషాదం
అదుపు తప్పి పెళ్లిబృందం లారీ బోల్తా ఇద్దరి దుర్మరణం మరో 32 మందికి తీవ్రగాయాలు తక్కెళ్లపల్లి శివారులో ఘటన పచ్చని తోరణాలు..బంధువుల సందడి.ఒకరినొకరి పలకరింపులు.. చిన్నారుల కేరింతలు.. ఆడపడుచుల అలంకరణలు.. ఇలా ఆ ఇంట్లో పండగవాతావరణం..కొన్ని గంటల్లో ఓ జంటను ఒక్కటి చేసేందుకు పెళ్లి బృందం సభ్యులంతా ఓ లారీలో బయలుదేరారు...పట్టుమని పది నిమిషాలు గడిచాయో లేదో.. ఈ లోపు పిడుగులాంటి వార్త.. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం - చింతపల్లి చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామ పంచాయతీ పరి ధి రోటిగడ్డతండాకు తౌర్యానాయక్ కుమారు డు ఇస్లావత్ నరేష్‌కు నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి తండాకు చెందిన సీతారామ్‌నాయక్ కుమార్తె అనుజతో బుధవారం ముష్టిపల్లిలో వివాహం జరగనుంది. ఆ వేడుకకు హాజరయ్యేందుకు పెళ్లికుమారుడి బంధువు లు తక్కెళ్లపల్లి నుంచి లారీలో బయలుదేరారు. అదుపుతప్పి.. బోల్తాకొట్టడంతో.. తక్కెళ్లపల్లి నుంచి బయలుదేరిన పెళ్లిబృందం లారీ గ్రామ శివారులోకి రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తాకొట్టింది. దీంతో లారీలో ప్ర యాణిస్తున్న నేనావత్ బాష (62), నేనావత్ చావిలి (65) అక్కడికక్కడే మృతిచెందగా నేనావత్ జ్యోతి, నేనావత్ సోనా, నేనావత్ రంజిత, నేనావత్ అశోక్, కేతావత్ నాకో, ఇస్లావత్ బాలా, నేనావత్ సావుకార్, నేనావత్ కిష న్, ఇస్లావత్ నాన్కు, నేనావత్ జంగి, ఇస్లావత్ మహేష్, ఇస్లావత్ జంగి, ఇస్లావత్ గోవి ందు, ఇస్లావత్ లక్ష్మి, మెగావత్ సుప్రజ, ఇస్లావత్ బిచ్యా, ఇస్లావత్ అఖిల, ఇస్లావత్ కమ్లి, నేనావత్ జీజీ, నేనావత్ రెడ్డి, ఇస్లావత్ రుక్క మ్మ, నేనావత్ భూమిక, నేనావత్ సుప్రియ, సపావట్ లక్ష్మి, నేనావత్ జుమాని, నేనావత్ రాం చంద్ర, ఇస్లావత్ బుజ్జి, నేనావత్ కింగినా, నేనావత్ చక్రి, నేనావత్ చంటి, ఇస్లావత్ రా ములు, స్వప్నలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆహాకారాలు.. ఆర్తనాదాలు పెళ్లి బృందం లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో అందులో ఉన్న వారు తలా ఒ దిక్కు ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలతో తమను రక్షిం చాలని కోరుతూ వారు చేసిన ఆర్తనాదాలకు స్థానికులు చలించిపోయారు. ప్రమాదం జరి గిందని తెలసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్య లో ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొంపముంచిన అతివేగం వివాహానికి వెళ్తున్న డ్రైవర్ లారీని అజాగ్రత్తతతో, అతివేగంతో నడపడంతో ప్రమాదం చో టు చేసుకుందని క్షతగాత్రులు ఆరోపించారు. గ్రామం నుంచి బయల్దేరిన పది నిమిషాలకే అతివేగంతో ఉన్న లారీ తక్కెళ్లపల్లి గ్రామశివారులోకి రాగానే సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టిందన్నారు. ఇరుకు రోడ్డులోనూ అతివేగంగా వచ్చి ప్రమాదానికి డ్రైవరే కారణమయ్యాడని క్షతగాత్రులు వాపోయారు. రోడ్డుపై లారీ పడి ఉండటంతో వాహనాలు వెళ్లే దారి లేకపోవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్న క్షతగాత్రులు ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులు మధ్యాహ్న సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతపల్లికి 108 ఒకటి మాత్రమే అందుబాటులో ఉండటంతో అందులో సుమారు 15 మందిని హుటాహుటీనా హైదరాబాద్‌కు తరలించినప్పటికీ ప్రమాదంలో గాయపడిన మరో 15 మంది వరకు అక్కడే పడి ఉన్నారు. దేవరకొండ 108కు సమాచారం అందించినప్పటికీ సమయానికి సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో క్షతగాత్రులు ఆటో, ట్రాక్టర్ ద్వారా పోలీసులు, బంధువులు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే సంతాపం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తక్కెళ్లపల్లి గ్రామశివారులో ప్రమాదం చోటు చేసుకుందని విషయం తెలుసుకున్న చింతపల్లి ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డితో పాటు నాంపల్లి సీఐ ఈర్లపల్లి వెంకట్‌రెడ్డి, మర్రిగూడ ఎస్ఐ మురళి హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
ఊక లారీ బోల్తా: ఇద్దరి మృతి
గుంటూరు : ఊక లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మాచర్ల మండలం ఉప్పలపహాడ్ శివారులో ఊక లోడుతో వెళ్తున్నలారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డుపై ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి వారిని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (మాచర్ల ) -
లారీ బోల్తా పడి ముగ్గురి దుర్మరణం
నిర్మల్(మామడ) : మామడ మండలంలోని బూరుగుపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ (24), దీప్‌చంద్ (20), ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భరత్ (20) మృతి చెందారు. వీరు ఫరిదాబాద్ నుంచి కర్నూల్‌కు లారీలో కొత్త ద్విచక్రవాహనాలను తీసుకెళ్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న లారీ బూరుగుపల్లి సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కనున్న రోలింగ్‌కు తగిలింది. బోల్తా పడిన తర్వాత దాదాపు వంద మీటర్ల వరకు దూసుకెళ్లింది. దీంతో లారీ డ్రైవర్ ముకేష్‌తోపాటు మరో ఇద్దరు లారీలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. ఖానాపూర్ సీఐ నరేష్కుమార్, లక్ష్మణచాంద ఎస్సై నవీన్‌కుమార్, మామడ ఏఎస్సై సిద్ధేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను నిర్మల్‌కు తరలించారు. -
విషాదం
రెండు రోడ్డు ప్రమాదాల్లో.. ఐదుగురు దుర్మరణం విజయనగరంలో ట్యాంకర్ ఢీకొని ముగ్గురు, మధురవాడలో లారీ బోల్తా పడి ఇద్దరి మృతి.. తొమ్మిదిమందికి తీవ్రగాయాలు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను రెండు లారీలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ ప్రమాదాల్లో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం పట్టణంలో ట్యాంకర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో సంఘటనలో విశాఖ జిల్లా మధురవాడలో లారీ బోల్తా పడి ఇద్దరు మృతిచెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ రెండు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం క్రైం/ఎల్.కోట: విజయనగరం పట్టణంలోని కాటవీధికి చెందిన సి.కె.మణి (65), సి.నరేంద్ర, సి.ఎస్.ఎన్.మూర్తి, సి.కామేశ్వర శాస్త్రిలు పట్టణంలోని గుమ్చీ సమీపంలో బంధువుల ఉపనయన కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమం పూర్తిచేసుకుని ఆటోలో ఇంటికి బయలు దేరారు. స్థానిక బుంగవీధికి చెందిన బండ సత్యవతి అనే మహిళ తన ఇంటికి వెళ్లేందుకు అదే ఆటో ఎక్కింది. ఈ ఆటో వెళ్తున్న సమయంలో..పట్టణంలోని రింగురోడ్డు బాబామెట్టకు వెళ్లే రోడ్డులో ఉన్న పెట్రోలు బంకులో ద్విచక్ర వాహనానికి పెట్రోలు పోసుకుని వస్తున్న కిలిమిరాజు (27) అనే వ్యక్తిని కొత్తపేట వైపునుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ తొలుత ఢీకొట్టింది. వెను వెంటనే ఎదురుగా వస్తున్న ఆటోను కూడా ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ సుంకరి నారాయణరావు (35) అక్కడిక్కడే మృతిచెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న సి.కె.మణి, సి.నరేంద్ర, సి.ఎస్.ఎన్.మూర్తి, సి.కామేశ్వరశాస్త్రి, బైక్‌పై వస్తున్న కిలిమిరాజు(27), బుంగవీధికి చెందిన బండ సత్యవతిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కేంద్రాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే సరికి కిలిమిరాజు, సి.కె.మణి మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వారిని వైద్యులు విశాఖపట్నం రిఫర్ చేశారు. ఆటోలో చిక్కుకున్న నారాయణరావు మృతదేహం ఆటోను ఢీకొట్టిన లారీ..పది అడుగుల దూరం ఈడ్చుకెళ్లి చెట్టుకు ఢీకొట్టడంతో నారాయణరావు డ్రైవరు సీటులోనే మృత్యు ఒడికి చేరాడు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, ఎస్సై ఎస్.అమ్మినాయుడు, ఏఎస్సై యు.ఎ.రాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆటోలో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు సుమారు గంటన్నరపాటు తీవ్రప్రయత్నం చేశారు. చివరకు ఆటోను పక్కకు తీసి నారాయణరావు మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆ రోడ్డే కొంప ముంచిది. గుమ్చీ దగ్గర ఉపనయనం పూర్తయిన సి.కె.మణి కుటుంబ సభ్యులకు తర్వాత ఆదే రోడ్డులో కాటవీధికి వెళ్లే రోడ్డు ఉంది. కానీ ట్రాఫిక్ ఇబ్బందులు, ఇరుకుగా ఉంటుందని భావించి రింగోరోడ్డు మీదుగా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ రోడ్డు సి.కె.మణి మృతికి కారణమవగా, అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని తీవ్ర గాయాల పాల్జేసింది. బతుకు తెరువుకోసం.. మృతిచెందిన ఆటో డ్రైవర్ సుంకరి నారాయణరావు సొంత గ్రామం గంట్యాడ మండలంలోని నరవ. డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామంలోని అత్తవారింటికి బతుకు తెరువుకోసం వెళ్లాడు. ఆటో నడుపుకొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. నారాయణరావుకు భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన కిమిలిరాజు మున్సిపల్ కాంప్లెక్స్‌లోని కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోపిస్తున్నాడు. రాజుకు భార్య మధు, ఏడాది పాప ఉంది. డ్రైవర్ పరారీ.. ట్యాంకర్‌ను నడుపుతున్న డ్రైవర్ ప్రమాదం జరగగానే పరారయ్యాడు. మద్యం మత్తులోనే డ్రైవర్ ఈ ప్రమాదానికి కారకుడయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖ జిల్లాలో.. ముమ్మనివానిపాలె, కొత్తవలస(లక్కవరపుకోట): విశాఖ జిల్లా మధురవాడ సమీపంలోని మారికవలస వద్ద లారీ బోల్తాపడి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తవలస మండలం నుంచి విశాఖపట్నం జిల్లాకు సిమెంట్ ఇటుకలను లారీపై తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా కొట్టడంతో లారీపై ఉన్న కొత్తవలస మండలంలోని ముమ్మనిపాలెం చెందిన బోగాది అచ్చిబాబు(28), బోగాది అప్పారావు(58) అనే వ్యక్తులు మృతి చెందారు. ఇదే ప్రమాదంలో పెద్దఅచ్చిబాబు, రమణ, రాజాన పైడిరాజు, పిల్లా గణేష్‌లు తీవ్రగాయాలపాలయ్యారు. మృతుడు అచ్చిబాబుకు భార్య లక్ష్మి, ఓ బాబు, పాప ఉన్నారు. అప్పారావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
పెళ్లింట విషాదం
గిద్దలూరు: పెళ్లింట విషాదం నెలకొంది. అంతవరకూ సందడిగా సాగిన వారి పయనంలో అపశృతి చోటుచేసుకుంది. నల్లమల అడవుల మలుపులో లారీ బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలైన సంఘటన ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి జరిగింది. అందిన వివరాల ప్రకారం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన బిజ్జా నరసయ్యకు కర్నూలు జిల్లా గోపవరానికి చెందిన యువతితో వివాహమైంది. అనంతరం తిరుగు పెళ్లిలో భాగంగా చట్రెడ్డిపల్లెకు చెందిన బంధువులతో పెళ్లి కుమారుడు, పెళ్లికుమార్తెతో కలిసి గోపవరానికి లారీలో వెళ్తున్నారు. ఇందులో వరుని బంధువులంతా కలిసి దాదాపు 70 మందికి పైగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని పాత రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత లారీ కొండను ఢీకొనడంతో బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న 70 మంది పెళ్లి బృందం ఒక్క సారిగా కింద పడిపోయారు. లారీ కింద పడిన పలువురు అక్కడికక్కడే మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వీరిలోనూ 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వివాహ వేడుకల నడుమ ఆనందాల్ని పంచుకోవాల్సిన తరుణంలో ఇంత విషాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. లారీలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్తపు గాయాలతో ఉండటం చూస్తే ఎంతటి ఘోరప్రమాదమో తెలుస్తోంది. ఈ సంఘటనలో వరుడు నరసయ్యకు, వధువుకు ఎలాంటి గాయాలు కాలేదని బంధువులు చెబుతున్నారు. మిగిలిన ప్రతి ఒక్కరికీ గాయాలయ్యాయి. ఇందులో గడ్డం వెంకటయ్య (40) గిద్దలూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ కింద పడి తిరుపాలు, ప్రభాకర్, ఏసోబు, కర్నూలు జిల్లా బోయలకుంటకు చెందిన ఉడుముల జయమ్మ చనిపోయారు. గాయపడిన వారిలో మంజు, బిజ్జ సురేష్ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందరికీ ఏరియా వైద్యశాల వైద్యులు, ఆర్ఆర్ నర్సింగ్ హోం వైద్యులు చికిత్సలందిస్తున్నారు. -
లారీ బోల్తా..ముగ్గురికి తీవ్ర గాయాలు
గిద్దలూరు: లారీ బోల్తాపడి కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నగర పంచాయతీ పరిధిలోని ఏసీ గోడౌన్ సమీపంలో నంద్యాల-ఒంగోలు రహదారిపై గురువారం జరిగింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల మేరకు కాకినాడలో వరి కోతలు పూర్తి చేసుకుని వరికోత యంత్రాన్ని లారీలో ఎక్కించుకుని నంద్యాలకు వెళ్తుండగా..రంగారెడ్డిపల్లె దాటాక లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపు తప్పి కుడివైపున్న చెట్లను ఢీకొనబోయింది. డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న యంత్రం ఓనరు హనుమంతు లారీ స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈఘటనలో హనుమంతుతో పాటు డ్రైవర్ గోవిందా అధికారి, వరికోత యంత్రం ఆపరేటర్ ఆనంద్ మండల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.