గుంటూరు : ఊక లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. మాచర్ల మండలం ఉప్పలపహాడ్ శివారులో ఊక లోడుతో వెళ్తున్నలారీ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డుపై ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి వారిని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(మాచర్ల )