అర్ధరాత్రి దారుణం
Published Mon, Nov 28 2016 1:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
కొడుకు చేతిలో తండ్రి హతం
రాళ్లతో మోది.. గొడ్డలితో నరికి..
చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో ఘటన
చింతపల్లి : కొడుకు చేతిలో ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వస్కుల ముత్తయ్య (50)కి కుమారుడు, కూతురు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు శంకర్ బీటెక్ రెండో సంవత్సరం వరకు చదివి మానేసి జులారుుగా తిరుగుతున్నాడు.
మందలించాడని..
ముత్తయ్య ఆదివారం రాత్రి వ్యవసాయ బావి వద్ద నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఇంట్లో టీవీ చూస్తూ కనిపించిన కుమారుడిని చూడడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదువు మధ్యలోనే మానేశావు..ఏ పని చేయకుండా తిరుగుతుంటే పూట ఎలా గడుస్తుందని మందలించాడు. దీంతో కుమారుడు శంకర్ కూడా తండ్రిపై కేకలు వేశాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
గాఢ నిద్రలో ఉండగా ఘాతుకం..
వాగ్వాదం ముగిసిన తర్వాత ముత్తయ్య ఇంట్లో పడుకున్నాడు. అరుుతే అప్పటికే తండ్రిపై కక్షపెంచుకున్న శంకర్ మాత్రం హత్య చేయాలని నిర్ణరుుంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న తం డ్రిని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి తొలుత రాళ్లతో తలపై బలంగా మోదాడు. కిందపడడంతో ఆపై గొడ్డలి తీసుకుని తలను మొండెం నుంచి వేరు చేశాడు. అంతటితో ఆగకుండా రెండు కాళ్లను దారుణంగా నరికేశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న తల్లి వచ్చే సరికి శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఏడుపులను విని చుట్టు పక్కల వారు వచ్చే సరికి ముత్తయ్య అప్పటికే విగతజీవుడయ్యాడు. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్‌ఐ నాగభూషణ్‌రావు పరిశీలించారు. పరారీలో ఉన్న నిం దితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు.
Advertisement
Advertisement