Published
Mon, Aug 22 2016 11:53 PM
| Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
రెండు ఆటోలు ఢీ, 10 మందికి తీవ్రగాయాలు
చింతపల్లి : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం... కొండమల్లేపల్లి వైపు నుంచి∙ఓ ఆటో, చింతపల్లి వైపు నుంచిlవస్తున్న మరో ఆటో నసర్లపల్లి స్టేజీ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చింతపల్లికి సంతకు వెళ్లి వస్తున్న నసర్లపల్లి గ్రామానికి చెందిన పద్మ, సాలమ్మ, సంతోష, యాదయ్య, వెంకటయ్య, వెంకటేష్, సుకుమార్, కౌసల్య, లక్ష్మి, నాగమణి, యాదమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం చింతపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.