చింతపల్లి మండల కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నల్గొండ : చింతపల్లి మండల కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థి మంగళవారం అనుమానాస్పదస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పి.శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.