చింతపల్లి : ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చింతపల్లి మండలంలోని హోమంతాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అనాజీపురంలో చోటు చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి సీఐ వెంకట్‌రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...
దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన దర్శనం పర్వతాలు, అంజమ్మ కుమార్తె రేణుక (28)ను చింతపల్లి మండలం హో మంతాలపల్లి గ్రామ పరిధిలోని అనాజీపురం గ్రామానికి చెందిన వస్కుల రాములు కుమారుడు రాజుకు పది సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపిం చారు. అప్పటి నుంచి వారికి సంతానం లేని కారణంగా ప్రతి రోజూ రేణుకను హింసించేవాడు.
సోమవారం గ్రామస్తులు వనభోజనాలకు వెళ్లడంతో భార్యాభర్తలు ఇరువురూ వెళ్లారు. అక్కడ మద్యం సేవిం చిన రాజు తన భార్యను చితకబాదాడు. దీంతో మనస్థాపానికి గురైన రేణుక అక్కడే వ్యవసాయ పొలంలో ఉన్న పురుగుల మందును తాగింది. విషయం తెలుసుకున్న స్థాని కులు, బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం చింతపల్లికి తరలి స్తుం డగా మృతి చెందింది.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం
మండలంలోని అనాజీపురంలో రేణుక మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కొమ్మేపల్లి గ్రామస్తులు అనాజీపురానికి చేరుకున్నారు. అక్కడ రాజు కుటుంబ సభ్యులకు, రేణుక కుటుంబీకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న నాంపల్లి సీఐ వెం కట్‌రెడ్డి, ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తమ సిబ్బం దితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. అనంతరం సంఘటనకు గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భర్తే కారణమని ఫిర్యాదు
రేణుకకు సంతానం లేని కారణంగా పది సంవత్సరాల నుంచి ప్రతి రోజూ రాజు రేణుకను చితకబాదేవాడని ఆమె బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. రాజు మద్యం సేవించి రేణుకను హింసకు గురి చేసేవాడని, సోమవారం కూడా కొట్టడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
Published Wed, Apr 6 2016 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement
Advertisement