రాహుల్ గాంధీ పర్యటన 17కు వాయిదా
అల్లిపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చింతపల్లి పర్యటనను ఆగస్టు 5 నుండి 17కు వాయిదా వేసినట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఆగస్టు 5న ఓటింగ్‌కు జరగనున్నందున రాహుల్ చింతపల్లి పర్యటన వాయిదా పడినట్టు తెలియజేశారు.