జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. చింతపల్లి వద్ద ఒకరు, కొయ్యలగూడెం శివారులో మరొకరు, ఎల్లారెడ్డిగూడెం వద్ద ఇంకొకరు మృత్యువాత పడ్డారు. కొండమల్లేపల్లి, జలాల్‌పూర సమీపంలో, అక్కంపల్లి స్టేజీ వద్ద ఒక్కొక్కరు దుర్మరణం పాలయ్యారు.
చింతపల్లి : రెండు బైక్‌లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చింతపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గట్టుపల్లి రఘుమారెడ్డి (24) చింతపల్లి మండలం ఉమ్మంతాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అనాజీపురంలోని తన అత్తగారింటికి దసరా పండగకు వస్తున్నాడు. మార్గమధ్యలో చింతపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో చింతపల్లి ఎక్స్‌రోడ్డు వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో రఘుమారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
బైక్ పైనుంచి పడి...
చౌటుప్పల్: మండలంలోని కొయ్యలగూడెం శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. వివరాలు.. మండలంలోని ఖైతాపురం గ్రామానికి చెందిన గోపి రాజు(32) ఆర్టీసీ డ్రైవర్. ఇతనికి ఇద్దరు పిల్లలు. దసరా పండగకని అతని భార్య, పిల్లలు రెండు రోజుల క్రితమే సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం వెళ్లారు. ఈయన కూడా శుక్రవారం రాత్రి అత్తవారింటికి బైక్‌పై బయలు దేరాడు. కొయ్యలగూడెం శివారులోకి రాగానే జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి దిగువ భాగంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో బ్రిడ్జికి ఉన్న పైపు రాజు తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ ఇన్స్‌పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు.
బస్సులో నుంచి జారిపడి వృద్ధుడు
కొండమల్లేపల్లి : బస్సు నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర పుల్లయ్య (68) కొండమల్లేపల్లి నుంచి గుడిపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా కొండమల్లేపల్లి చౌరస్తా మూలమలుపు వద్ద బస్సులో నుంచి జారిపడ్డాడు. దీంతో బస్సు వెనుక చక్రాల కింద అతడి శరీరం పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బొలెరో వాహనం బోల్తా పడి యువకుడు..
తిరుమలగిరి : బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈఘటన తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామ పరిధిలో శుక్రవా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండా కు చెందిన రాధాక్రిష్ణ బోలోరో వాహనంలో తిరుమలగి రికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన లో రాధాక్రిష్ణ 19) తీవ్ర గాయాలై అక్కడిక్కక్కడే మృతి చెందాడు మృతుడి తండ్రి బద్రు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిదర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
అక్కంపల్లి స్టేజీ వద్ద వాహనం ఢీకొని..
వలిగొండ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని అక్కంపల్లి స్టేజీ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నాతాళ్లగూడేనికి చెందిన కొరబోయిన లక్ష్మణ్ (22) మిత్రుడి బైక్ తీసుకుకుని వలిగొండకు వచ్చి తిరిగి నాతాళ్లగూడెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కంపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మాత్రం ఏదో వాహనం ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం సంఘటన స్థలం నుంచి రామన్నపేట వైద్యశాలకు తరలించారు. సదురు మృతుడిని ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందా.. లేదా అతడే బైక్‌ై పె నుంచి జారి పడి మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్లారెడ్డిగూడెం వద్ద గుర్తుతెలియని వృద్ధుడు...
నార్కట్‌పల్లి : రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధుడు(70) మృతి చెందిన సంఘటన నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. యల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఓ వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీ కొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీ సులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితున్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడు తెల్లటి చొక్క, దోవతి ధరించి ఉన్నాడని, అతని చేతికి రెండు ఇత్తడి రింగులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతని వద్ద రూ. 1500 నగదు ఉన్నట్లు తెలిపారు. మృతుడి సం బంధికులు ఎవరైనా ఉంటే నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ఈ మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మోతిరామ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
Published Sun, Oct 5 2014 3:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement