విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం చింతపల్లి మండలం రాజుపాకల వద్ద వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో భయపడిన వాహన డ్రైవర్ వాహనం వదలి పరారైయ్యాడు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.