విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం ఎ. సోమవరం వద్ద శుక్రవారం ఉదయం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.