'ఆదిమ జాతి అంతరిస్తుంది' | ysrcp kurupam mla kidari sarveswara rao speech in chintapalli meeting | Sakshi
Sakshi News home page

'ఆదిమ జాతి అంతరిస్తుంది'

Published Thu, Dec 10 2015 4:47 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

'ఆదిమ జాతి అంతరిస్తుంది' - Sakshi

'ఆదిమ జాతి అంతరిస్తుంది'

చింతపల్లి: బాక్సైట్ తవ్వకాలతో నీరు కలుషితమవుతుందని వైఎస్సార్ సీపీ అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలతో 250 గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

విషపూరిత రసాయనాలు విడుదలయి, భూగర్భ జలాలు కలుషితవుతాయని చెప్పారు. చట్టుపక్కల ప్రాంతాల్లో ప్రవసిస్తున్న నదీజలాలు కూడా కలుషితం అవుతాయని, గిరిజన ప్రజలకు కొత్త రకాల రోగాలు వచ్చి ఆదిమ జాతి అంతరిస్తుందని అన్నారు. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల వాసులకు తాగునీరు సంక్షోభం తప్పదని, విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement