
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం ముఖ్యమంత్రి చేతుల మీదగా జరగనుంది.
ఈ నేపథ్యంలో సీఎం చేతుల మీదుగా ట్యాబ్‌లు అందుకునేందుకు యడ్లపల్లికి వెళ్తున్న విద్యార్థులు.. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మేనమామ సీఎం వైఎస్ జగన్‌కు పేపర్లపై కార్టూన్లు వేసి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జగన్ మామయ్య అంటూ నినాదాలతో సీఎంకు విషెస్ తెలిపారు.
చదవండి: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment