
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు చేస్తూ ఈ నెల 4న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు మూడు మృతదేహాలు లభ్యంకాగా, మిగిలిన మూడు మృతదేహాలు బుధవారం తీరానికి కొట్టుకువచ్చాయి. ఓడరేపు బీచ్‌లో లభ్యమైన నల్లపు రాఘవ(18), సర్వసిద్ధి వెంకట ఫణికుమార్ (19), జక్కంపూడి ప్రభుదాస్ (17) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: (కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..)
Comments
Please login to add a commentAdd a comment