Suryalanka beach
-
అల్లకల్లోలంగా సూర్యలంక బీచ్
-
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ..
-
లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ.. యువకుల ఫొటోలు, వీడియోలు వైరల్
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): దసరా పండుగ సెలవులను మరింత సరదాగా చేసుకుందామని ఆశపడిన ఆ యువకుల ఆలోచన ఆవిరైపోయింది... వారి స్నేహబంధాన్ని చూసి ఓర్వలేని ఆ కడలి వారిని కబళించింది... తమ పిల్లలే తమ సర్వస్వంగా బతుకుతున్న ఆ నిరుపేద తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను... గుండెశోకాన్ని మిగిల్చింది... బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకుల్లో మొత్తం ఆరుగురు యువకులు మృతిచెందారు. దీంతో సింగ్‌నగర్, శాంతినగర్ ప్రాంతాలు ఆ యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన ఆర్తనాదాలతో కన్నీటి సంద్రంగా మారాయి. చదవండి: పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి.. విజయవాడ సింగ్‌నగర్ కృష్ణాహోటల్ సెంటర్లోని శివాలయం రోడ్డు, పైపులరోడ్డు సమీపంలోని శాంతినగర్ మస్జీద్ పరిసర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువకులు చెరుకూరి సాయిమధు(16), బాజం అభిలాష్(17), చింతల సాయిప్రణిదీప్(18), నల్లపు రాఘవ(16), సర్వసుద్ది వెంకట ఫణికుమార్(14), ప్రభుదాస్(17), చందాల కైలాష్(13), వసంత పరిశుద్ధ(17) ఈ నెల 4వ తేదీన బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో కైలాష్, పరిశుద్ధ మినహా మిగిలిన ఆరుగురు సముద్రం లోపలికి వెళ్లి స్నానం చేస్తూ అలల తాకిడికి గల్లంతయ్యారు. వీరిలో చెరుకూరి సాయిమధు, బాజం అభిలాష్, చింతల సాయిప్రణిదీప్ మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. గల్లంతైన మరో ముగ్గురు సర్వసుద్ది వెంకట ఫణికుమార్, ప్రభుదాస్, చందాల కైలాష్ల మృతదేహాలు బుధవారం గుర్తించారు. దీంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పండుగ రోజంతా కన్నీటి సంద్రంలో మునిగారు. బుధవారం ముగ్గురికి, గురువారం ముగ్గురికి వారి వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బాపట్ల బీచ్‌కు వెళ్లే ముందు ఎనిమిది మంది యువకులు రైలులో దిగిన సెల్ఫీ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. రైలులో వారు సరదాగా సినిమా పాటలకు పేరడీ చేస్తూ గడిపిన క్షణాలను చూసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వాటిని చూసిన బంధువులు, స్థానికులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు శాంతినగర్, సింగ్‌నగర్ ప్రాంతాల్లో యువకుల మరణవార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకట్రావ్, అలంపూరు విజయలక్ష్మి వారికి బాసటగా నిలిచారు. విషయం తెలిసిన దగ్గర నుంచి వైఎస్సార్సీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి వెంకట్రావ్, అలంపూరు విజయ్ దగ్గరుండి యువకుల తల్లిదండ్రులను బాపట్ల పంపడం, బాపట్లలో అధికారులతో మాట్లాడి వారి భౌతికకాయాలు తీసుకురావడంతో పాటు దగ్గరుండి వారి అంత్యక్రియలను నిర్వహించారు. ఎమ్మెల్యే విష్ణు, డెప్యూటీ మేయర్ శ్రీశైలజ, కార్పొరేటర్ అలంపూరు విజయ్ ఒక్కొక్కరూ రూ.5 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు మొత్తం ఆరుగురికి రూ.90 వేలను మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా అందించారు. యువకుల మరణవార్తను తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు కె.దుర్గారావు, బి.రమణారావు, దాసరి దుర్గారావు తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతిచెందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): బాపట్ల సముద్రంలో స్నానానికి వెళ్లి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. సింగ్‌నగర్, శాంతినగర్‌కు చెందిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను గురువారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన పరామర్శించారు. 61వ డివిజన్లోని సచివాలయంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆరు కుటుంబాలకు రూ.లక్షన్నర విలువైన చెక్కులను అందజేశారు. తక్షణ సాయంగా మాత్రమే తన వంతుగా ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. బాధితులందరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, నార్త్‌జోన్ తహసీల్దార్ చందన దుర్గాప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావ్, అవుతు శ్రీనివాసరెడ్డి, అలంపూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ముగ్గురు కూడా మృత్యువాతే!
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు చేస్తూ ఈ నెల 4న ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు మూడు మృతదేహాలు లభ్యంకాగా, మిగిలిన మూడు మృతదేహాలు బుధవారం తీరానికి కొట్టుకువచ్చాయి. ఓడరేపు బీచ్‌లో లభ్యమైన నల్లపు రాఘవ(18), సర్వసిద్ధి వెంకట ఫణికుమార్ (19), జక్కంపూడి ప్రభుదాస్ (17) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..) -
సూర్యలంక బీచ్‌లో వీకెండ్ జోష్.. రాబడి కుష్
హోరుగాలికి లయబద్ధంగా కేరింతలు కొడుతున్నట్టు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. అలలతోపాటే ఎగిరెగిరి పడుతూ ఆనందగానం చేస్తున్నట్టు కిలకిలారావాలు చేసే వలస పక్షుల విన్యాసాలు.. ప్రకృతి సరికొత్త ‘అల’ంకారమేదో అద్దినట్టు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మిలమిలా మెరుస్తూ కనువిందు చేసే సాగర జలాలు.. స్వచ్ఛమైన గాలి వీచే సుందర అటవీప్రాంతం.. ఇవన్నీ సూర్యలంక సొంతం. అందుకే ఈ తీరాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారాంతాల్లో అధికసంఖ్యలో పోటెత్తుతున్నారు. సాక్షి, బాపట్ల: వీకెండ్ వస్తే చాలు.. సూర్యలంక తీరం కోలాహలంగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయం పెరుగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల నష్టపోయిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. సూర్యలంక ప్రత్యేకతలివే.. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఈ తీరంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ రెండుకిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉంటాయి. ఇవి పర్యాటకులకు స్వచ్ఛమైన గాలులతో స్వాగతం పలుకుతాయి. ఈ తీరంలో అడపాదడపా డాల్ఫిన్లు విన్యాసాలు చేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. రవాణా మార్గం.. అనుకూలం బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే సూర్యలంక ఉంటుంది. రవాణా మార్గం అనువుగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచీ యువత వారాంతంలో సూర్యలంకకు తరలివస్తారు. ఇక్కడ పర్యాటకులకు సకల వసతులూ అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు సమీపంలో ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం, పొన్నూరులోని ఏకశిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ. కలెక్టర్ చొరవతో.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే విజయకృష్ణన్ సూర్యలంక తీరంపై దృష్టిపెట్టారు. ఈ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్‌జిందాల్ సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం సేవించి హల్చల్ చేసే మందుబాబులకు రూ.పదివేలు జరిమానా విధించాలని ఆదేశించారు. పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సూర్యలంక తీరంలో పర్యాటకాభివృద్ధికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాల భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు కేటాయించిన భూముల్లోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ చైర్మన్ ఆరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు. పెరిగిన ఆదాయం తీరంలో పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతోంది. గతంలో నెలకు సగటున రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం రూ.40 లక్షలకు చేరుకుందని పేర్కొంటున్నారు. ఏడాదికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు వివరిస్తున్నారు. 32 రూమ్‌లతో సూర్యలంక తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
మెరిసే తీరం సూర్యలంక బీచ్
సాక్షి, అమరావతి: బాపట్ల తీరంలోని సూర్యలంక అత్యంత అరుదైన బంగారపు వర్ణపు ఇసుక (గోల్డెన్ శాండ్)తో అంతర్జాతీయ బీచ్‌ల సరసన నిలుస్తోంది. ఈ బీచ్ అర్ధ చంద్రాకారంలో వంపు తిరిగి ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలల ఉధృతి లేకుండా (సైలెంట్ సీ) పర్యాటకులు స్నానాలు చేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. బీచ్ వెంబడి నీళ్లలో ఎక్కడా రాళ్లు లేని ఈ బీచ్ ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ సాధించే దిశగా అడుగులేస్తోంది. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ (ఐసీజెడ్‌ఎం) ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించేలా 9 బీచ్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్‌లో కేంద్ర పర్యావరణ శాస్త్రవేత్తల బృందం నీటి నాణ్యత, పర్యావరణ, పర్యాటకుల రక్షణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సూర్యలంక అత్యంత సురక్షితమైన, ఆహ్లాద వాతావరణం అందించే బీచ్‌గా ఉండటంతో దీని అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఐసీజెడ్‌ఎం బీచ్‌లను బ్లూఫ్లాగ్కు అనుగుణంగా తయారు చేసేందుకు ఏపీలో రూ.10 కోట్లతో ‘స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ యూనిట్(ఎస్సీజెడ్ఎంయూ)’ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో 20 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ, మిగిలిన 50 శాతం నిధులను ప్రపంచ బ్యాంకు సమకూరుస్తోంది. నీటి నాణ్యత పరిశీలన ఇలా.. బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్‌లో సముద్రపు నీటి నాణ్యత పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఇటీవల కేంద్ర పర్యావరణ శాస్త్రవేత్తల బృందం సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్‌లలో పర్యటించి వరుసగా ఐదు రోజుల పాటు నీటి నాణ్యతను పరిశీలించారు. దాదాపు ఒక్కోచోట 30 నుంచి 40 వరకూ నమూనాలు సేకరించారు. బీచ్ ఒడ్డు నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్లి వీటిని తీసుకున్నారు. నీటిలో ఉప్పు, ఆక్సిజన్, నైట్రోజన్, పొటాషియం శాతాలను పరిశీలిస్తారు. బీచ్ మొత్తం భాగంలో ఎక్కడ నీటి నమూనాలు బాగుంటాయో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. నీటిలో సముద్రపు జంతువులు లేని, చర్మ వ్యాధులకు అవకాశం లేని, లోతు, పర్యాటకులు ఎంత లోపలికి వెళ్లొచ్చు, కెరటాల ఎత్తు తదితర అంశాలను గుర్తిస్తారు. ఆ సర్కిల్లో వాష్ రూమ్‌లు, కుర్చీలు, ఆట స్థలం, గార్డెనింగ్, పర్యాటకుల రక్షణ కోసం స్థానిక మత్స్యకారులతో సేఫ్ గార్డులను నియమిస్తారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి బ్లూ ఫ్లాగ్ కోసం బీచ్‌లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నాం. సూర్యలంక బీచ్‌కు అన్ని అర్హతలు ఉండటంతో దీనిపై దృష్టి సారించాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు 21 బీచ్‌లు ఉండగా.. మరిన్ని బీచ్‌లను తయారు చేయనున్నాం. సూర్యలంకకు దేశంలోనే అరుదైన బీచ్‌గా గుర్తింపు ఉంది. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ -
బుడిబుడి అడుగులు బాపట్లలో..
సాక్షి, అమరావతి బ్యూరో/బాపట్ల టౌన్ : సముద్ర తాబేళ్లుగా పిలిచే ‘ఆలీవ్ రిడ్లే’ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల తీరంలోని సూర్యలంక బీచ్‌లో ఇప్పటికే 8 వేలకు పైగా ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లను సేకరించారు. వాటిని పొదిగించి 6 వేల పిల్లలను సముద్రంలోకి వదిలిపెట్టారు. మరో 2 వేల గుడ్లను పొదిగించే పనిలో ఉన్నారు. ఈ తాబేళ్లు సముద్ర గర్భంలోని పాచి, పిచ్చి మొక్కలు, జెల్లీ ఫిష్, ఇతర వ్యర్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చూస్తాయి. మత్స్య సంపదను పెంపొందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ మత్స్యకారులకు జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన, పర్యావరణ నేస్తాలైన ఈ జాతి తాబేళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్రంలో భారీగా కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, పెద్దబోట్ల రాకపోకల వల్ల నలిగిపోవడం, వాటి గుడ్లను నక్కలు, కుక్కలు వంటివి తినేయడం వంటి కారణాల వల్ల వాటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఈ జాతిని సంరక్షించేందుకు ఆటవీ శాఖ అధికారులు బాపట్ల డివిజన్ పరిధిలోని సూర్యలంక, నిజాం పట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సంరక్షణ కేంద్రాల ఏర్పాటుతో.. అనువైన పరిస్థితులు ఉండటంతో ఆలివ్ రిడ్లే తాబేళ్లు రేపల్లె రేంజ్ పరిధిలోని బాపట్ల, నిజాంపట్నం తీరాలకు ఏటా వలస వచ్చి గుడ్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఆటవీ శాఖ 2020 డిసెంబర్లో సూర్యలంక, నిజాంపట్నం తీరాల్లో తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ రెండుచోట్లా హేచరీలను నెలకొల్పి మత్స్యకారులను కూలీలుగా నియమించింది. ఈ తాబేళ్లు అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల మధ్య ఒడ్డుకు చేరతాయి. తీరంలోని ఇసుక తిన్నెల్లో గుంతలు తీసి గుడ్లు పెట్టి.. వాటిని ఇసుక మూసివేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇసుక తిన్నెల్లో తాబేళ్ల అడుగు జాడలను మత్స్యకారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. వాటి గుడ్లను సేకరించి హేచరీలకు తరలిస్తుంటారు. గతంలో సముద్ర తాబేళ్ల గుడ్లను నక్కలు, కుందేళ్లు, కుక్కలు వంటివి తింటూ ఉండేవి. దీనివల్ల ఆ జాతి తాబేళ్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. వీటి బారినుంచి సంరక్షించేందుకు అటవీ శాఖ నడుం కట్టడంతో ఆ జాతి మనుగడకు అవకాశం ఏర్పడింది. తీరం నుంచి సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్ల పిల్లలు మత్స్యకారులకు వరం ఈ తాబేళ్ళు సముద్రంలోని చేపలకు హాని కలిగించే జెల్లీ ఫిష్‌ను తిని మత్స్య సంపద పెరుగుదలకు సహకరిస్తుంది. చేపల వేట సమయంలో జెల్లీ ఫిష్ మత్స్యకారుల వలలకు తగిలితే వాటి పోగులు దెబ్బతింటాయి. ఆ పోగులు తగిలితే మత్స్యకారులకు జ్వరం, శరీరమంతా నొప్పులతో అనారోగ్యం పాలవుతుంటారు. ఇంతటి ప్రమాదకరమైన జెల్లీ ఫిష్‌ను తినే శక్తి ఒక్క ఆలివ్ రిడ్లే తాబేళ్లకు మాత్రమే ఉంది. సముద్రంలో అలజడి నెలకొన్నప్పుడు ఈ తాబేళ్లు వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టి తీరానికి చేరుకుంటాయి. వీటి రాకను గమనించిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం మానుకుంటారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో సముద్రంలో పేరుకుపోయిన వ్యర్థాలు వాటికి అడ్డుపడుతుంటాయి. అలాంటి వ్యర్థాలను తాబేళ్లు భుజించి చేపల పునరుత్పత్తికి దోహదం చేస్తాయి. సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కూడా ఈ తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయి. సంరక్షించేందుకే హేచరీలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్ల సంతతిని అభివృద్ధి చేసేందుకు డీఎఫ్‌వో రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక హేచరీలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 8 వేలకు పైగా గుడ్లను సేకరించాం. వాటిల్లో 6 వేల పిల్లలను సముద్రంలో ఇప్పటికే వదిలిపెట్టాం. మిగిలిన రెండు వేల గుడ్లు పొదిగే దశలో ఉన్నాయి. – జఫ్రుల్లా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, బాపట్ల వీటి జీవనం మత్స్యకారులకు వరం సముద్రంలో ఉండే జెల్లీ ఫిష్ వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ జాతి తాబేళ్లు సూర్యలంక తీరంలో సంచరిస్తున్నప్పటి నుంచి జెల్లీ ఫిష్ సమస్యల నుంచి మత్స్యకారులకు ఊరట లభిస్తోంది. ఈ తాబేళ్లు జీవనం మత్స్యకారులకు వరం. – కన్నా మామిడయ్య, డైరెక్టర్, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం, బాపట్ల -
సూర్యలంక బీచ్‌లో విషాదం
బాపట్ల(గుంటూరు): గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్రస్నానానికి వచ్చిన యువకుడు గుండెపోటుకు గురై మృతిచెందాడు. కృష్ణా జిల్లా ఎనికెపాడు గ్రామానికి చెందిన లోకేష్ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి ఆదివారం సూర్యలంక బీచ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. -
సూర్యలంక బీచ్‌లో విషాదం
బాపట్ల: విహారయాత్రలో విషాదం అలముకున్న సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో జరిగింది. విహారయాత్ర కోసం వచ్చిన తొమ్మిదిమంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బయోటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న పగడాల కావ్య, గుంటి ప్రత్యూష, గోనాల సుష్మప్రియ, కొలిమర్ల సత్యసాయిప్రసాద్, ఇందుజ, జరీనాతోపాటు కె.ఎల్. యూనివర్సిటీలో బీటెక్ (ప్రథమ) చదువుతున్న వారి ఇంటర్ క్లాస్మేట్స్ శివాని, వివేక్, ఉదయ్ మొత్తం తొమ్మిదిమంది మంగళవారం ఉదయం విజ్ఞాన్ కళాశాల నుంచి ఆటోలో సూర్యలంక తీరానికి చేరుకున్నారు. వీరిలో కావ్య, ప్రత్యూష, సుష్మప్రియ, సత్యసాయిప్రసాద్ స్నానాలు చేసేందుకు ఉదయం 11గంటల సమయంలో సముద్రంలోకి దిగారు. అప్పటికే అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో సుష్మప్రియ నీటిలో లోతుకు వెళ్లింది. ఆమెను కాపాడేందుకు ప్రత్యూష(18), కావ్య, సత్యసాయిప్రసాద్(19)లు కూడా లోపలికి దిగారు. వీరంతా అలల ఉధృతికి కొట్టుకుపోవడాన్ని గమనించిన సందర్శకులు కేకలు వేయడంతో తీరంలో పహారా కాస్తున్న మెరైన్ హోంగార్డు నాయుడు శ్రీనివాసరావు మత్స్యకారుల సహాయంతో నీటిలోకి దిగి కావ్య, ప్రత్యూష, సుష్మప్రియలను ఒడ్డుకు చేర్చారు. ప్రత్యూష నీరు ఎక్కువగా తాగడంతో మృత్యువాత పడింది. సత్యసాయిప్రసాద్ గల్లంతైన రెండు గంటల తర్వాత మృతదేహమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. సుష్మప్రియ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, కావ్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యలంక బీచ్‌లో విద్యార్థి గల్లంతు
బాపట్ల : స్నేహితులతో కలిసి సముద్రం స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన తరుణ్‌సాయి పాల టెక్నిక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి సూర్యలంక బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ధాటికి తరుణ్ గల్లంతయ్యాడు. కళ్లెదుటే స్నేహితుడు మునిగి పోవడంతో మిత్రులంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
సూర్యలంక బీచ్‌లో వ్యక్తి గల్లంతు
గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక బీచ్‌లో గురువారం ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి జిల్లాలోని అమృతలూరు మండలం యరవల్లు గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు చెప్పారు. -
పడవ బోల్తా: ఇద్దరు మృతి
బాపట్ల టౌన్ (గుంటూరు జిల్లా) : బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరంలో గురువారం పడవ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. సముద్రంలో అలలు ముంచెత్తడంతో నల్లమోతు రత్నబాబు (30), గురజాల లక్ష్మీనారాయణ (40) మృత్యుఒడికి చేరారు. స్థానికుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన ఎనిమిది మంది సూర్యలంక తీరంలో కార్తీక స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. వీరంతా సూర్యలంక సమీపంలోని పేరలి డ్రెయిన్ మీదుగా పడవపై విహారయాత్రకు బయలుదేరారు. ఇందుకోసం స్థానికంగా మత్స్యకారులకు రూ.1000 చెల్లించారు. పడవలో సూర్యలంక పొగురు సమీపంలోకి వెళ్లేసరికి ఒక్కసారిగా వెంటవెంటనే వచ్చిన అలలు పడవను ముంచెత్తాయి. దీంతో పడవ బోల్తాపడి ఎనిమిది మంది సముద్రంలో పడిపోయారు. గమనించిన మత్స్యకారులు ఆరుగురిని రక్షించారు. మిగిలిన రత్నబాబు, లక్ష్మీనారాయణ మృత్యువాత పడ్డారు. మృతదేహాలను బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యలంక బీచ్ లో విషాదం
గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం బీచ్ లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. జిల్లాలోని కాకుమానుకు చెందిన రత్నం, లక్ష్మీనారాయణ బీచ్ కి స్నానానికి వెళ్లారు. అలల దాటికి మునిగిపోవడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషయాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు..!
♦ సూర్యలంక బీచ్‌పై అధికారుల నిర్లక్ష్య వైఖరి ♦ ఐదేళ్లలో 58 మంది యువకుల ప్రాణాలు బలి ♦ శాపంగా మారిన అధికారుల సమన్వయ లోపం ♦ బీచ్ పక్కనే బెల్టు దుకాణాలు.. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాక్షి, గుంటూరు: ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే వీరిలో చలనం వస్తుంది.. అది కూడా కేవలం రెండు మూడు రోజులు హడావిడి చేస్తారు.. ఆ తరువాత షరామామూలే.. అది మా తప్పు కాదంటే.. మాది కాదంటూ ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు.. వారం కిందట సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన తెలిసిందే.. అధికారుల నిర్లక్ష్యానికి ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి..? ఎంతమంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తారు..? అంటూ జిల్లా ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఒకేఒక్క బీచ్ సూర్యలంక కావడం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట వంటి ప్రాంతాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కళాశాలలు అధికంగా ఉండటంతో విద్యార్థులు సెలవురోజుల్లో ఆటవిడుపుగా ఇక్కడకు వస్తూ ఉంటారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క సూర్యలంక బీచ్‌లోనే 58 మంది విద్యార్థుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. భద్రతా చర్యల్లో అధికారుల వైఫల్యం.. సముద్రంలో మునిగి ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ సూర్యలంక బీచ్ సమీపంలో ఒక్క పీహెచ్సీ గానీ.. కనీసం అంబులెన్స్ సౌకర్యంగా అధికారులు ఏర్పాటు చేయలేదు. బెల్టు దుకాణాలు రద్దు చేస్తూ సీఎం తొలి సంతకం చేసినా సూర్యలంక బీచ్ వద్ద మాత్రం రెండు బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడకు వచ్చిన విద్యార్థులు మద్యం తాగి సముద్రంలో దిగుతుండటంతో మత్తులో ఈదలేక ఊపిరాడక మృతి చెందుతున్నారు. సముద్రంలో ఎంత దూరం వరకూ వెళ్లవచ్చు.. ఎక్కడ నుంచి లోతు, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపే సూచికలు ఏమీ లేవు. సముద్రంలో మునిగితే రక్షించే గజ ఈతగాళ్లను, లైఫ్జాకెట్లను ఏర్పాటు చేయకపోవడంలో మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సముద్రం ఏఏ సమయాల్లో ఉధృతంగా ఉంటుంది.. ఆయా సమయాల్లో సముద్రంలోకి దిగడం శ్రేయస్కరం కాదనే విషయాన్ని తెలియజేయడంలో వాతావరణ శాఖ, బెల్టు దుకాణాలు తొలగించడంలో ఎక్సైజ్ శాఖ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటంలో పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి విలువైన ప్రాణాలు సముద్రంపాలు కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సూర్యలంకకు కొత్త శోభ
సూర్యలంక (బాపట్ల): సూర్యలంక బీచ్‌కు కొత్త శోభను తీసుకురావాలని, పర్యాటకులకు తగిన రక్షణ కల్పించటంతోపాటు వారు ప్రశాం తంగా తిరిగి వెళ్లేవరకు అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పని చేయాలని ప్రభుత్వాధికారులు నిర్ణయించారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉన్న సూర్యలంక బీచ్‌కు కొత్త శోభను తీసుకురావడానికి, పర్యాటకుల రక్షణ, సదుపాయాలను కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్, రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్లతోపాటు 12 శాఖల అధికారులతో బుధవారం సూర్యలంకలో సమీక్షా సమావేశం జరిగింది. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు వచ్చి న యువకులు గత ఐదేళ్ళలో 58 మంది మృతి చెందారని తెలిపారు. ఇటీవల మరో నలుగురు విద్యార్థులు మృత్యువాతకు గురయ్యారని చెపుతూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో పోలీసు ఔట్ పోస్టు, వైద్యశాల నిర్మా ణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరారు. సూర్యలంకను స్పెషల్ జోన్‌గా ప్రకటించాలి .. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరం పంచాయతీ పరిధిలో ఉండటం, పంచాయతీలకు నిధులు తక్కువగా ఉండటంతో స్పెషల్ జోన్‌గా ప్రకటిస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు పర్యాటకులు ప్రశాంతంగా స్నానాలు ఆచరించేందుకు ఇక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించాలని కోరారు. పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ఉన్న షాపుల్లోకి వ్యాపారస్తులు వెళ్ళేలా చూడాలని కోరారు. బెల్టుషాపులు లేకుండా చూస్తాం .. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ మాట్లాడుతూ తీరంలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చూస్తామని తెలిపారు. సూర్యలంకలో ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిధులు ఉన్నాయని, వాటి తో వెంటనే ప్రచార మైకులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థలం కేటాయించేందుకు అభ్యంతరం లేదు ... ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ తీరం వద్ద ఔట్ పోస్టు, వైద్యశాల ఏర్పాటుకు స్థలం కేటాయిం చేందుకు అభ్యంతరం లేదన్నారు. రెవెన్యూ భూములపై సర్వే చేయించి సంబంధిత శాఖలకు భూమిని కేటాయిస్తామని చెప్పారు. వలలతో రక్షణ వలయాలు .... నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు కఠిన చర్యలు చేపడతామని ఎక్సై జ్ డీఎస్పీ వి.అరుణకుమారి తెలిపారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఎయిర్‌పోర్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని సీనియర్ చీఫ్ సెక్యూర్టీ ఆఫీసర్ బి.ఖాన్, అసిస్టెంట్ సెక్యూర్టిటీ ఆఫీసర్ మధు తెలిపారు. సముద్రం తీర ప్రాంతంలో కొంత భాగానికి కంచె వేసేం దుకు చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ జిల్లా అధికారి సునీత తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్రంలో ఎంత వరకు స్నానాలు చేసేందుకు వెళ్ళాలో సూచించే వలయాలను ఏర్పాటు చేస్తామని ఏడీఏ రాఘవరెడ్డి చెప్పారు. అవసరమైతే వలలతో రక్షణవలయం ఏర్పా టు చేయటం, గజ ఈతగాళ్ళను రంగంలోకి దించుతామని తెలిపారు. లైఫ్ జాకె ట్లు ఏర్పాటుకు ఏపీ టూరిజం అసిస్టెంట్ డెరైక్టర్ వీవీఎస్ గంగరాజు సుముఖత తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ జివి. రమణ, సీఐలు సాధినేని శ్రీనివాసరావు, ఆంజనేయులు, మెరైన్ సీఐలు శ్రీనివాసరాజు, నిమ్మగడ్డ రామారావు, ఎక్సైజ్ సీఐ నయనతార తదితరులు పాల్గొన్నారు. -
సముద్ర స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు