
సాక్షి, బాపట్ల జిల్లా : ఉద్యోగ రీత్యా అమెరికాలో నివసిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి వాసి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన భారత కాలమానం ప్రకారం శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన పొట్టి రాజేశ్ కుమార్(42) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఫ్లోరిడాలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బీచ్‌కు వెళ్లాడు.
బీచ్‌లో స్నానం చేస్తున్న కుమారుడు మునిగిపోతుండటంతో నీళ్లలోకి వెళ్లి కుమారుడిని రక్షించి తాను ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి మృతిచెందాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు మృతదేహాన్ని పట్టణానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.