ఢిల్లీ: తిరుమల శ్రీవారీ లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం (సెప్టెంబర్30) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేయగా.. ఈ రెండు పిటిషన్లను రేపు ఒకేసారి సుప్రీంకోర్టు విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment