‘పాపం చంద్రబాబుదే.. ‘లడ్డూ’ కుట్రపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే’ | Ysrcp Leaders Comments On Chandrababu Laddu Politics | Sakshi
Sakshi News home page

‘పాపం చంద్రబాబుదే.. ‘లడ్డూ’ కుట్రపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే’

Published Sat, Sep 28 2024 1:34 PM | Last Updated on Sat, Sep 28 2024 5:59 PM

Ysrcp Leaders Comments On Chandrababu Laddu Politics

సాక్షి, తిరుపతి: తిరుమల ఆలయ పవిత్రత మంట కలిపే విధంగా చంద్రబాబు వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేయడం సరికాదన్నారు.

మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని.. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు వేంకటేశ్వరస్వామిని వైఎస్‌ జగన్‌ ఎన్నోసార్లు దర్శించుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. వెంకన్న చౌదరి తిరుమలలో అన్యమతస్తులకు ప్రవేశం లేదంటూ పెద్ద ఎత్తున బోర్డులు పెట్టారు. వెంకన్న చౌదరి వెంకన్నకు సేవ చేయాలి. చంద్రబాబుకు కాదు. వైఎస్‌ జగన్‌ పర్యటన రద్దువ్వగానే వెంటనే ఫ్లెక్సీలు తీసేశారు. రోజుకు 700 మందికి పైగా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తారు. ఏనాడు డిక్లరేషన్ తీసుకోలేదు’’ అని  భూమన అన్నారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాడి మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల రామకృష్ణారెడ్డి

  • బాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్టును లీక్‌ చేశారు
  • వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు
  • ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లుగా చంద్రబాబు ఘోరమైన ఆరోపణలు చేశారు.

వేంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు: మార్గాని భరత్

  • గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది
  • తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్‌మోహన్‌రెడ్డి బట్టబయలు చేశారు.
  • వేంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు
  • ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూజలు చేశారు.
  • జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసింది
  • జూలై నెలలో వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారు
  • NDDBకి పంపించిన శ్యాంపుల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది
  • వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారు
  • జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారు
  • చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారు
  • చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
  • నాలుగు ట్యాంకులు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారు
  • 2014-19 మధ్య 14 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు
  • 2019-24 మధ్య 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు
  • చంద్రబాబుకు హిందుత్వం పట్ల...హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా
  • బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు...అదేనా హిందుత్వమంటే
  • వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారు
  • చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలి
  • సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు
  • పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనం చేసుకున్నారు
  • డిక్లరేషన్ పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?
  • నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా...తెలియక మాట్లాడుతున్నారా?
  • NDDB నుంచి వచ్చిన నివేదిక....టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారు?
  • NDDB నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు
  • జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పర్మిషన్‌ లేదని.. మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారు.
  • చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అధికారులు అమలు చేస్తారు.
  • ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారు
  • ప్రాయశ్ఛిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్‌కు తెలుసా?
  • చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా?
  • బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలి

సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి: బొత్స


విశాఖపట్నం: నెయ్యికల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని మాజీమంత్రి,వైఎస్‌ఆర్‌సీపీసీనియర్‌నేత బొత్ససత్యనారాయణ అన్నారు.విశాఖపట్నంలో శనివారం(సెప్టెంబర్‌28)బొత్స మీడియాతో మాట్లాడారు.‘నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు.నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే థర్డ్‌పార్టీతో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు?

చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్‌ వేసుకున్నారు.కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయవిచారణకు వెనుకాడుతున్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థరాజకీయలు చేస్తున్నారు.ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా..ఇది న్యాయమా అని ప్రశ్నించారు బొత్స

దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి లాగి నీచ రాజకీయాలు: చెవిరెడ్డి
ప్రకాశం జిల్లా: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం అనైతికమని విమర్శించారు ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ముందు పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వందలాది వెంకటేశ్వరస్వామి గుడులు కట్టించారని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గుర్తు చేశారు.

వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఐదుసార్లు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఆయన కొడుకుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు.  చంద్రబాబు నాయుడు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగా నీచ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడకూడదనే అందరం స్పందించడం లేదని చెవిరెడ్డి పేర్కొన్నారు. 

చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
విశాఖ పట్నం: రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి చంద్రబాబు లాగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డూని తెరపైకి తెచ్చారు. సీఎం లడ్డూపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మొదట మాట్లాడారు. కల్తీ లడ్డూ ఎక్కడ వాడారో తనకు తెలియదని మళ్ళీ అంటున్నారు. వైఎస్‌ జగన్ నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు.. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు

.. అసలు వాస్తవాలు తెలియాలంటే లడ్డూ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు వేసిన సిట్‌పై నమ్మకం లేదు.. తిరుపతి వెళ్తామంటే నోటీసులు ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా?. గతంలో వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్సార్‌ తిరుపతి వెళ్లలేదా.. మళ్లీ వైఎస్ జగన్ తిరుపతి వెళతారు. ఎవరు ఆపుతారో చూస్తాం

వైఎస్‌ జగన్‌కు వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తి చంద్రబాబుకు లేదు. రుషికొండ టీటీడీ దేవాలయాన్ని వైఎస్‌ జగన్ హయాంలోనే నిర్మించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ దీక్షలు చేయాలి. జనసేన ఎమ్మెల్యే దళిత ఉద్యోగిపై దాడి చేసినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి’

డిక్లరేషన్‌ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?: మాజీ మంత్రి అంబటి రాంబాబు
అసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. డిక్లరేషన్‌ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?. బాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా వైఎస్‌ జగన్‌ తిరుమల వెళ్లారు. అప్పుడు డిక్లరేషన్‌ ఎందుకు అడగలేదు?. వైఎస్‌ జగన్‌ను మానసికంగా వేధించాలని కుట్రలు చేస్తున్నారు.

కూటమి నేతల మెదడులోనే ‘కల్తీ’: వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌
కూటమి ప్రభుత్వం గత పది రోజులుగా తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ఇష్టానుసారంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన పాపాలకు వారికే శిక్షలు పడాలని ఆ దేవుడిని కోరుతున్నాం. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాం. కల్తీ లడ్డూలో జరగలేదు... కల్తీ నెయ్యిలో జరగలేదు. కూటమి నేతల మెదడులోనే కల్తీ జరిగింది.

పాదయాత్ర ముగించుకుని జగన్ నేరుగా తిరుమల వెళ్లారు. ఆ రోజు చంద్రబాబు ఎందుకు డిక్లరేషన్ అడగలేదో సమాధానం చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో కలిసి వెళ్లినపుడు ఆ రోజు బీజేపీ నేతలు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?. తిరుమల వెంకన్న స్వామిపై వైఎస్‌ జగన్‌కి అపారమైన నమ్మకం ఉంది. కాబట్టే తిరుమలతో నవనీత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. జీతాలు రెట్టింపు చేశారు. ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఏ రోజు ఏ మతంలో ఉంటాడో.. ఏ కులంలో ఉంటాడో తెలియని పవన్‌ను చంద్రబాబు డిక్లరేషన్ అడగాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement