సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పాదయాత్ర రసాభాసగా సాగింది. నిన్న(మంగళవారం) తిరుపతి అలిపిరి మెట్లమార్గం నుంచి 4.45 నిముషాలకు ప్రారంభించిన పాదయాత్ర దాదాపు 5 గంటలపాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 9.20 నిముషాలకు తిరుమలకు చేరుకున్నారు. నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆదిలోనే నిరసించిపోయారు. అలసిపోయి నడవడానికి ఇబ్బందులు పడ్డారు. దారిపొడవున కూర్చుంటూ వచ్చారు. నడవలేక అష్టకష్టాలు పడ్డారు.. ఎలాగోలా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.
పవన్ కల్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే అపేసారు.. డిప్యూటీ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మెట్లమార్గం పొడవున రోప్ వేసి తిరుమలకు వచ్చే భక్తులను చుక్కలు చూపించారు. గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన తిరుమల గిరులు వ్యక్తిగత నినాదాలతో తిరుమల పవిత్రతను మంటగలిపారు.
ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందే నినాదాలు చేస్తున్నా ఆపకుండా వేడుక చూశారు.. సనాతన ధర్మం అంటూ నినదిస్తున్న పవన్‌కి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు పోలీసులు మరో అడుగు ముందుకేసి మోకాళ్ళ మెట్లు వద్ద వాహనాలను ఆపివేశారు. దాదాపు గంటన్నర పాటు వాహనాలు నిలిపోవడంతో తిరుమల జీఎన్సీ వరకు వాహనాలు నిలిపోయింది. దీంతో స్వామివారిని దర్శించుకోని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: కింకర్తవ్యం!? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనం
గంటపాటు ఆలస్యం కావడంతో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సకాలంలో చేరుకోలేక నానా కష్టాలు పడ్డారు. తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్ బస్టాండ్ వరకు నడిచి అక్కడి నుంచి వాహనంలో పద్మావతి ప్రాంతంలో ఉన్న గాయత్రి నిలయం చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment