సాక్షి, తిరుమల: టీటీడీ నిబంధనలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కేశారు. తన ఇద్దరి కుమార్తెలతో పవన్ మహాద్వారా ప్రవేశం చేశారు. భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. అయితే, పిల్లలకు వర్తించదని టీటీడీ అంటోంది. నిబంధనలకు విరుద్దంగా పవన్ కల్యాణ్ క్యారివాన్ తిరుమలలో చక్కర్లు కొట్టింది. తిరుమలలో నిషేధంలో ఉన్న వాహనాలను టీటీడీ అధికారులు అనుమతించారు.
మరోవైపు, డిప్యూటీ సీఎం పర్యటనలో టీటీడీ అధికారులు, భద్రతా అధికారులు పవన్ ఆశీస్సుల కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. దాదాపు గంటపాటు క్యూలైన్ నిలిపివేశారు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ దర్శనం కారణంగా భక్తులకు మరింత ఆలస్యం అవుతుంది.
గతంలో అనేక మంది డిప్యూటీ సీఎంలు స్వామివారి దర్శనానికి వచ్చిన ఎన్నడూ ఇంత రాజమర్యాదలు చెయ్యలేదు...కానీ డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్‌కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడం సర్వత్ర విమర్శలు తావిస్తోంది. మరో పక్క స్వామివారిని దర్శించుకున్న భక్తులు, తిరువీధుల్లో ప్రదక్షణలు చేసే భక్తలను భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. తిరువీధుల్లో ఉన్న గ్యాలరీలు తాళాలు వేసి భక్తులను అనుమతించలేదు.. దాదాపు గంటన్నర పాటు ఆలయం వద్ద భక్తులకు రాకపొకలు నిలిపేశారు. దీంతో భక్తులు గెట్లు ఎక్కి దుకారు.. గతంలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రసన్న చేసుకోవడానికి అధికారులు దాసోహం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment