అమరావతి, సాక్షి: తిరుపతి లడ్డూ వ్యవహారంలో.. ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ (Rajasekaran) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సోమవారం ఆయన ఓ పిటిషన్ వేశారు.
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) ఫిర్యాదుతో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో.. తనపై అరెస్టు సహా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తన పిటిషన్‌లో ఆయన కోరారు.
నెయ్యి శాంపిల్స్ సేకరణ జరిపి.. దాన్ని విశ్లేషించడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ నిబంధనలేమీ అనుసరించలేదని ఆయన తన పిటిషన్‌లో ప్రస్తావించారు. అలాగే తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని, రాజకీయ కారణాలతో కేసు పెట్టారని ఆరోపిస్తున్నారాయాన. ఈ క్రమంలో తన ముందస్తు బెయిల్ మంజూరుకు ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఈ పిటిషన్ రేపు(మంగళవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: లడ్డూ వివాదం.. జగన్ చెప్పిందే కోర్టూ చెప్పింది!
Comments
Please login to add a commentAdd a comment