సాక్షి,విశాఖపట్నం : సీఎం చంద్రబాబు పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరారు’అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుపతి ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారు. తిరుపతి లడ్డుపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్రానికి కుల రాజకీయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు. నేడు కొత్తగా మత రాజకీయానికి పునాదులు చేశారు. మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు.
అధికారంలోకి వచ్చిన తరువాత 35 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ద్వసం చేశారు. కలుషిత ఆహారం తిని చిన్న పిల్లలు చనిపోయారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్‌లో 4000 మంది కాంట్రాక్ ఉద్యోగులను తీసేసారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతల రాజీనామాలు అవసరం లేదు. ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ బలంతోనే నడుస్తుంది.
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అపక పోతే మద్దతు ఉపసంహరిస్తామని చెప్పండి. వీటన్నిటినీ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కల్తీ నెయ్యి వాడ లేదని ఈవో చెప్పారు. జూలై నాలుగో తేదీన వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపమని ఈవో చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీబీఐ విచారణ జరిపించ లేదు. చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాయాలి.
తిరుపతి మీద మీకు అంత భక్తి ఉంటే తిరుపతి జిల్లాకు ఎక్కువ మద్యం షాపులు కేటాయించారు. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే చంద్రబాబు 264 షాపులు కేటాయించారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని టీడీపీ గెజిట్ ఈనాడు పేపర్‌లో రాశారు. గతంలో జేబు నిండా డబ్బులు పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. నేడు సంచి నిండా డబ్బులు పట్టుకెళ్తె జేబు నిండా కూరగాయలు వస్తున్నాయి.
చంద్రబాబు ఒక పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరాడు. అపవిత్రమైన టీడీపీ ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment