gudiwada amarnath
-
ఎల్లో మీడియాపై గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం
సాక్షి,విశాఖ : ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లోమీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తునే ఉన్నారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరింది..కేబినెట్లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. సైకీతో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ అని ఎలా రాస్తారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కంటే వైఎస్ జగన్ 2.49 పైసలకు కొన్నారు..ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగింది? ..వైఎస్ జగన్‌ను అదానీ కలిస్తే తప్పు. అదానీ జగన్‌ను కలిస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్లు. చంద్రబాబును అదానీ కలిస్తే అది గొప్పగా చెపుతారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే. వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చుగా. రూ.2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా. అధికమొత్తంలో కరెంట్‌ను కొనుగోలు చేసి రూ.86 వేల కోట్లు బారం వేసిన చంద్రబాబు గొప్పనా.. రాష్ట్రానికి లక్షా పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పనా...ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు రూ.20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారు.. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి. లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము’ అని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. -
చంద్రబాబు పొలిటికల్ జాదు : గుడివాడ
సాక్షి,విశాఖపట్నం : సీఎం చంద్రబాబు పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరారు’అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారు. తిరుపతి లడ్డుపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్రానికి కుల రాజకీయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు. నేడు కొత్తగా మత రాజకీయానికి పునాదులు చేశారు. మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు.అధికారంలోకి వచ్చిన తరువాత 35 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ద్వసం చేశారు. కలుషిత ఆహారం తిని చిన్న పిల్లలు చనిపోయారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్‌లో 4000 మంది కాంట్రాక్ ఉద్యోగులను తీసేసారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతల రాజీనామాలు అవసరం లేదు. ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ బలంతోనే నడుస్తుంది.స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అపక పోతే మద్దతు ఉపసంహరిస్తామని చెప్పండి. వీటన్నిటినీ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కల్తీ నెయ్యి వాడ లేదని ఈవో చెప్పారు. జూలై నాలుగో తేదీన వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపమని ఈవో చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీబీఐ విచారణ జరిపించ లేదు. చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాయాలి. తిరుపతి మీద మీకు అంత భక్తి ఉంటే తిరుపతి జిల్లాకు ఎక్కువ మద్యం షాపులు కేటాయించారు. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే చంద్రబాబు 264 షాపులు కేటాయించారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని టీడీపీ గెజిట్ ఈనాడు పేపర్లో రాశారు. గతంలో జేబు నిండా డబ్బులు పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. నేడు సంచి నిండా డబ్బులు పట్టుకెళ్తె జేబు నిండా కూరగాయలు వస్తున్నాయి.చంద్రబాబు ఒక పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరాడు. అపవిత్రమైన టీడీపీ ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. -
‘విశాఖపై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది’
సాక్షి, విశాఖపట్నం:రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో వైఎస్సార్సీపీ విజయోత్సవ కళ కనిపిస్తోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా.. వైఎస్సార్సీపీ విజయోత్సవ స్పందనను దారిమరల్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఐటి అభివృద్ధిపై విషపు రాతలు, పారిశ్రామిక ప్రగతిపై తప్పుడు రాతలతో ఎల్లో మీడియా విశాఖపట్నంపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని అన్నారు. టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తే వైఎస్సార్సీపీ హయాంలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 1 లక్షా 20 వేలమందికి ఉపాధి కలిగించామని పేర్కొన్నారు. 3.5 లక్షల ఎంఎస్ఎంఈ కంపెనీల్లో 15 లక్షల మందికి ఉపాధి కలిగిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. కరోనా సమయంలో వేయ్యి కోట్లు ఇచ్చి సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను ఆదుకున్నారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్ ఒన్‌గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు నిర్మించే క్రమంలో 3 పోర్టులు వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. తప్పుడు రాతలతో విషం చిమ్మితే జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్‌పై అసూయతో విషం చిమ్మే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కాదని.. సీఎం జగన్ తనకు అనేక పదవులు ఇచ్చారని అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్ ప్రేమాభిమానులు కోసం అమర్నాథ్ ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెబుతున్న స్టార్ క్యాంపైనర్లలో అమర్నాథ్ ఒకరని చెప్పారు. వైఎస్సార్సీపీ కోసం, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్‌ను మరల అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరమని.. అదే తన లక్ష్యమని పేర్కొన్నారు. చదవండి: ‘టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు.. ఆ పార్టీ పని అయిపోయింది’.. ఎంపీ కేశినేని నాని విమర్శలు -
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
సాక్షి, అమరావతి /విశాఖపట్నం/కొరాపుట్ / సాక్షి నెట్వర్క్: ఒడిశా రాష్ట్రంలో సంభవించిన ఘోర రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పాలుపంచుకుంటోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిశా సరిహద్దుల్లో ఉండే మన రాష్ట్రంలోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. 108 అంబులెన్స్‌లు 20, ఇతర అంబులెన్స్‌లు 25, మహాప్రస్థానం వాహనాలు 15 కలిపి 60 వాహనాలు ఘటన స్థలానికి తరలించారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. రైలులో ప్రయాణించిన మన రాష్ట్ర ప్రయాణికుల వివరాల ఆధారంగా కో ఆర్డినేట్ చేసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లాల డీఎంహెచ్ఒలను ఆదేశించారు. అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు: మంత్రి అమర్నాథ్ రైలు ప్రమాద బాధితులకు అత్యవసర సాయం అవసరమైతే హెలికాఫ్టర్ సేవలు వినియెగించుకోవాలని సీఎం ఆదేశించారని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా రైలులో ప్రయాణించి, ఫోన్‌కి స్పందించకపోతే వారిని గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖరగ్‌పూర్ నుంచి చాలా మంది తెలుగు వారు ఇదే రైలులో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. ఒక క్షతగాత్రుడి అభ్యర్థన మేరకు విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. కటక్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక అధికారుల బృందం, ప్రభావిత ప్రాంతంలోని ప్రతి ఆస్పత్రిలో ఆంధ్రా అధికారులు సేవల్లో ఉంటారని తెలియజేశారు. సహాయక చర్యలు ముమ్మరం: మంత్రి రజిని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 20 అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ అంబులెన్సులు, 21 మహాప్రస్థానం వాహనాలను పంపామన్నారు. ఈ వాహనాలను సమన్వయం చేసుకునేందుకు వైద్యం, రవాణా, పోలీసుశాఖల నుంచి ముగ్గురు అధికారులను నియమించామని చెప్పారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం కేజీహెచ్, విజయనగరం జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ఒడిశాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వైద్య సేవలు అందించాలని చెప్పామని తెలిపారు. కాగా, రైలు ప్రమాదంపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 0891–2590100, 0891 2590102, 9154405292 (వాట్సాప్ నంబర్) తాడేపల్లిలోని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101, 8333905022 (వాట్సప్) -
చిన్న సినిమాలకు ప్రభుత్వం సహకారం
సాక్షి, విశాఖపట్నం: థియేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని, అందులో భాగంగానే ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’ను ప్రారంభించిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్ ఆధ్వర్యంలో సినిమా విడుదలైన రోజునే ఇంట్లోనే కూర్చొని వీక్షించేలా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి అమర్నాథ్ శుక్రవారం విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా తొలి సినిమాగా నిరీక్షణ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫైబర్‌నెట్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారని, ఇప్పటికే 8 వేల పంచాయతీలకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఏడాదికి 100 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుంటే.. అందులో 20 మాత్రమే విడుదలవుతున్నాయని, మిగిలినవన్నీ ల్యాబ్‌లకే పరిమితమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా కొత్త సినిమా రిలీజ్ అయిన రోజునే 99 రూపాయిలకే 24 గంటలపాటు ఇంట్లో నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పుడు ప్రజల ఇంటికే కొత్త సినిమాను తెస్తున్నారన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందులు పడకుండా త్వరలోనే ట్రై పార్టీ అగ్రిమెంట్‌కు విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ చిన్న సినిమాల్ని ఆదరించేలా, ప్రొడ్యూసర్లకి చేయూతనందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల థియేటర్లకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఇది క్లిక్ అయితే ఆరు నెలల్లోనే పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు కూడా ఫైబర్‌నెట్‌ను ఆశ్రయిస్తారని చెప్పారు. నిరీక్షణ చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద సినిమాలకు లాభాలు వచ్చేందుకు అనేక దారులుంటాయని, చిన్న సినిమాలకు ఇప్పుడే దారి దొరికిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల తర్వాత 10వ రత్నం ఫస్ట్ డే ఫస్ట్ షో అని కొనియాడారు. భవిష్యత్తులో ఫైబర్‌నెట్ కోసం సినిమాలు తీసే రోజులు వస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ క్రియేటివ్ హెడ్ జోగినాయుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూధన్‌రెడ్డి, నిరీక్షణ హీరో సాయిరోనక్, డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇక, ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది. -
‘చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సహధర్మచారిణి’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును మించిన సైకో మరోకరు లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సహధర్మచారిణి. అందుకే సహధర్మచారిణిపై విమర్శలు చేస్తే చంద్రబాబుకు కోపం వస్తుంది. జనసేన కంటే ముందుగా చంద్రబాబు స్పందిస్తున్నారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య బంధం ఇప్పుడు బట్టబయలైంది. ఆ బంధాన్ని సక్రమం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. చంద్రబాబు వెనుక ఐదు కోట్ల మంది ఉంటే కుప్పం మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది. చంద్రబాబు ఉడత బెదిరింపులకు మా కార్యకర్త కూడా భయపడడు. మరోవైపు.. వైవీ సుబ్బారెడ్డి కూడా పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం పవన్ వెంపర్లాట. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న భాష సరిగా లేదు అంటూ మండిపడ్డారు. -
‘విశాఖ గర్జన రోజే పవన్ మీటింగ్ అవసరమా?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ గర్జన కోసం జేఏసీ సిద్దమైంది. ఇందులో భాగంగానే బుధవారం మంత్రి గుడివాడ అమర్నాథ్.. మూడు రాజధానులకు మద్దతుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ సాధన కోసం జేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ గర్జనలో అన్ని వర్గాలు పాల్గొంటాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలి అని కోరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ గర్జన అంటే పవన్ కల్యాణ్ నిద్ర లేచారు. విశాఖ గర్జన రోజే విశాఖలో పవన్ మీటింగ్ అవసరమా?. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే రాజధాని ఎందుకు వద్దు?. అమరావతిలో 29 గ్రామాలే.. ఇక్కడ 6వేల గ్రామాలు. ఉత్తరాంధ్ర రైతులు చాలా పేదవాళ్లు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలుద్దాము అని స్పష్టం చేశారు. -
విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం
అచ్యుతాపురం (అనకాపల్లి): అత్యంత ప్రతిష్టాత్మకమైన యకహోమా టైర్ల కంపెనీ అచ్యుతాపురం సెజ్‌కు రావడంతో విశాఖ జిల్లాకు ఎంతో ప్రయోజనం దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ నెల 16న అచ్యుతాపురం సెజ్‌లో ఈ కంపెనీని ప్రారంభించి, మరో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న నేపథ్యంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, మైనింగ్‌కు ఉపయోగించే వాహనాలకు అవసరమైన టైర్లను ఈ కంపెనీలో ఉత్పత్తి చేస్తారని చెప్పారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో ఈ కంపెనీ నిర్మాణం పూర్తయిందని, ఈ కంపెనీ వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరిగాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూములు కేటాయించి, పూర్తయిన కంపెనీల్లో ఇదొకటన్నారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి యకహోమా నాంది పలుకుతుందని చెప్పారు. ఈ కర్మాగారం విస్తరణకు మరో రూ.వెయ్యికోట్లు కేటాయించనున్నారని, తద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, సీఈవో ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు. -
‘ఢిల్లీలోనూ గల్లీలోనూ మాది ఒకటే మాట’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ధోరణిపై మండి పడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. ఢిల్లీలోనూ గల్లీలోనూ స్టీల్ ప్లాంట్‌పై తమ విధానం ఒక్కటే అని స్పష్టం చేశారు. చంద్రబాబులా తమది రెండు నాల్కల ధోరణి కాదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి..ఢిల్లీలో దాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రబాబుది అంటూ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జింక్ పరిశ్రమ చంద్రబాబు హయాంలోనే ప్రైవేట్ పరం అయింది అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్మానం చేశారని తెలిపారు. చదవండి: స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబుది పూటకో మాట -
కార్యనిర్వాహక రాజధానిని అడ్డుకోవద్దు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధాని కాకుండా చంద్రబాబు, ఆయన పార్ట్నర్ పవన్‌కల్యాణ్‌లు అడ్డుకోకూడదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు. దశాబ్దాల కాలంగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న తమ ప్రాంత ప్రజల ఆశలను అడియాశ చేయొద్దన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూ.. నిరంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► పవన్ కు విశాఖ ఏం చేసిందో.. ఎలా ఆదరించిందో.. ఎలా అవకాశాలు కల్పించిందో కొత్తగా చెప్పాల్సిన అవ సరం లేదు. సామాన్యుడిని అడిగినా చెబుతా రు. అలాం టి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేస్తున్న పవన్‌ను చూస్తుంటే.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉంది. ► దయచేసి అభివృద్ధిని ఆపొద్దు.. చేతులెత్తి జోడించి కోరుతున్నా.. చంద్రబాబు మాయలో పడొద్దు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్‌కల్యాణ్ చదవడం.. ఆయన సొంత పీఏ హరిప్రసాద్ ప్రశ్నలడగడం.. దానికి ఈయన సమాధానాలు చెప్పడం.. మీ వైఖరి మారదా? ఎన్నికల్లో రెండు చోట్ల ప్రజలు ఛీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదా? ► విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఉత్తరాంధ్ర ప్రజలంతా తగిన బుద్ధి చెబుతారు. ► అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని నీకు ప్యాకేజి ఇచ్చి, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడితే ప్రజల్లో కనీస గౌరవం కూడా కోల్పోతావు. ► ఇటీవల సినిమా డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ సినిమా తీస్తే.. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనే అని విష ప్రచారం చేస్తున్నావు.. సినిమా రంగంలో ఎలా ఉంటున్నావో అర్థం కాని పరిస్థితి. మీ సినిమాలతో మాకు గానీ, మా పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదు. ► చంద్రబాబు తోక పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆయన పార్ట్నర్ పవన్‌లు స్పందిస్తున్న తీరు చూస్తుంటే రాజధానిని అడ్డుకోవడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. -
అనకాపల్లిలో వైఎస్సార్సీపీ జెండా..
అనకాపల్లి: టీడీపీ కంచుకోటగా భావించే అనకాపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానంలో ఘన విజయం సాధించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజలు విశేష ఆదరణ చూపారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఆభ్యర్థి అమర్‌కు పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 8,169 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మినహాయించి 18 రౌండ్ల పరిధిలో అమర్‌కు 72,504 ఓట్లు, పీలాకు 66,479 ఓట్లు లభించాయి. ఫలితాన్ని అధికారికంగా ప్రకించాల్సి ఉంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో వైఎస్సార్సీపీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి అమర్ తన సమీప ప్రత్యర్ధి పీలా గోవింద సత్యనారాయణపై మొదటి 13 రౌండ్ల వరకు ఆధిపత్యంతో కొనసాగగా 14, 15, 16, 17 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి పీలాకు మెజార్టీ లభించింది. మళ్లీ 18వరౌండ్‌లో అమర్‌కే మెజార్టీ లభించింది. ముఖ్యంగా కశింకోట మండలం, అనకాపల్లి మండలాల్లో ఫ్యాన్‌కు మెజార్టీ రాగా అనకాపల్లి పట్టణంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి. మొత్తంమీద 8 వేల ఓట్లకు పైగా మెజార్టీ గెలుపొందిన అమర్ తన ఉద్వేగాన్ని ఆపులేకపోయారు. అమర్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కాండ్రేగుల సత్యవతి, వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్ తదితరులు అభినందించారు. మొత్తం 18 రౌండ్లల్లో జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కర్‌రావుకు 11,896 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఐఆర్ గంగాధర్‌కు 1744, బీజేపీ అభ్యర్థి పొన్నగంటి అప్పారావుకు 2517 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 1,60,304 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్సీపీకి 73197, టీడీపీకి 64,938, ఇతరులకు 22,159 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్ల వాకౌట్ ఆంధ్రా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఇన్సిమెంట్ ఆఫ్ టెక్నాలజీ పైఅంతస్తులో నిర్వహించిన అనకాపల్లి అసెంబ్లీ కౌంటింగ్‌కు హాజరైన బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్లకు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో వారు వాకౌంట్ చేసి వెళ్లిపోయారు. ఈ అంశాన్ని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, జేసీ సృజన దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె అనకాపల్లి పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నం కావడంతో వారు నిరాశగా బయటకు వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్లలోనూ మెజార్టీ అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో పోస్టల్, సర్వీస్ ఓటుల్లో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్కు మెజార్టీ ఓట్లు వచ్చాయి. అమర్‌కు 693 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణకు 459 ఓట్లు, జనసేన అభ్యర్ధి పరుచూరి భాస్కరరావుకు 97 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి పొన్నగంటి అప్పారావుకు 54 సర్వీస్ ఓట్లు వచ్చాయి. నోటాకు 2,517 ఓట్లు ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఎన్నికల పోలింగ్‌లో నోటాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,517 మంది ఎవరికి ఓటు వేసేందుకు ఇష్టపడకుండా నోటాకు నొక్కారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో1,58, 722 మంది ఈవీఎంల ద్వారా ఓట్లు వేయగా 18 రౌండ్ల పరిధిలో నోటాకు 2,517 మంది ఓటు వేయడం గమనార్హం. అభిమానులు తరలిరావాలి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ శుక్రవారం ఉదయం నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని అనంతరం రింగ్‌రోడ్డులోని పార్టీ కార్యాలయానికి విచ్చేస్తారని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు తెలిపారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, అనకాపల్లి ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు. -
ప్రజల మనోభావాలు తెలిపితే కేసులా?
విశాఖపట్నం: గిరిజనులు, ఆదివాసీల మనోభావాలను తెలియజేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అద్యక్షడు గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కేసులు పెట్టాలి కాని, ప్రజల తరపున మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు హత్యయత్నంతో సహా 5 కేసులను గిడ్డి ఈశ్వరి పై అన్యాయంగా బనాయించారని ఆయన విమర్శించారు. రాజ్యాంగం, న్యాయస్థాలు ఉన్నాయని, న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని అమర్ నాథ్ అన్నారు.