విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం | Gudiwada Amarnath On Yakahoma Tire Company At Visakha | Sakshi
Sakshi News home page

విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం

Aug 13 2022 4:51 AM | Updated on Aug 13 2022 3:58 PM

Gudiwada Amarnath On Yakahoma Tire Company At Visakha - Sakshi

సీఎం పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

అచ్యుతాపురం (అనకాపల్లి): అత్యంత ప్రతిష్టాత్మకమైన యకహోమా టైర్ల కంపెనీ అచ్యుతాపురం సెజ్‌కు రావడంతో విశాఖ జిల్లాకు ఎంతో ప్రయోజనం దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఈ నెల 16న అచ్యుతాపురం సెజ్‌లో ఈ కంపెనీని ప్రారంభించి, మరో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న నేపథ్యంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను శుక్రవారం మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, మైనింగ్‌కు ఉపయోగించే వాహనాలకు అవసరమైన టైర్లను ఈ కంపెనీలో ఉత్పత్తి చేస్తారని చెప్పారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో ఈ కంపెనీ నిర్మాణం పూర్తయిందని, ఈ కంపెనీ వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరిగాయని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూములు కేటాయించి, పూర్తయిన కంపెనీల్లో ఇదొకటన్నారు.

విశాఖ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి యకహోమా నాంది పలుకుతుందని చెప్పారు. ఈ కర్మాగారం విస్తరణకు మరో రూ.వెయ్యికోట్లు కేటాయించనున్నారని, తద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, సీఈవో ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement