
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును మించిన సైకో మరోకరు లేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి అమర్నాథ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సహధర్మచారిణి. అందుకే సహధర్మచారిణిపై విమర్శలు చేస్తే చంద్రబాబుకు కోపం వస్తుంది. జనసేన కంటే ముందుగా చంద్రబాబు స్పందిస్తున్నారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య బంధం ఇప్పుడు బట్టబయలైంది. ఆ బంధాన్ని సక్రమం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. చంద్రబాబు వెనుక ఐదు కోట్ల మంది ఉంటే కుప్పం మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది. చంద్రబాబు ఉడత బెదిరింపులకు మా కార్యకర్త కూడా భయపడడు.
మరోవైపు.. వైవీ సుబ్బారెడ్డి కూడా పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం పవన్ వెంపర్లాట. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న భాష సరిగా లేదు అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment