
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ధోరణిపై మండి పడ్డారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. ఢిల్లీలోనూ గల్లీలోనూ స్టీల్ ప్లాంట్‌పై తమ విధానం ఒక్కటే అని స్పష్టం చేశారు. చంద్రబాబులా తమది రెండు నాల్కల ధోరణి కాదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి..ఢిల్లీలో దాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రబాబుది అంటూ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జింక్ పరిశ్రమ చంద్రబాబు హయాంలోనే ప్రైవేట్ పరం అయింది అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్మానం చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment