సాక్షి,తాడేపల్లి : సత్యమేవ జయతే అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఈవో, చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ వీడియోలు పోస్ట్ చేశారు. దీని అర్ధం ఏంటి చంద్రబాబు? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
దీని అర్థం ఏంటి @ncbn ?
దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?
“సత్యమేవ జయతే’’ pic.twitter.com/gQ7R6X6WfE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2024
కాగా, సెప్టెంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు’’అని చంద్రబాబు అసత్యాలు వల్లివేశారు.
సెప్టెంబర్ 22వ తేదీన చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ.. తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు మళ్లీ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారు.
టీటీడీ ఈవో శ్యామలరావు ఆ ట్యాంకర్లను వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారానికి దిగారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా వీడియోలు పోస్ట్ చేసి చంద్రబాబు అసత్యపు ప్రచారాన్ని మరోసారి ఎండగట్టే యత్నం చేశారు.
ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు
Comments
Please login to add a commentAdd a comment