ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధికోసం చేస్తున్న తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు చేస్తున్న విష రాజకీయాలను ఎండగట్టారు.
చంద్రబాబు మళ్లీ మళ్లీ అబద్ధాలు
సెప్టెంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపడాన్ని కూడా వైఎస్ జగన్ వీడియో ముఖంగా ప్రస్తావించారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు’’అని చంద్రబాబు పేర్కొనడాన్ని వైఎస్ జగన్ కౌంటర్ చేశారు.
సెప్టెంబర్ 22వ తేదీన చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ..తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు చెప్పడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ట్యాంకర్లను ఈవో వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారం చేయడాన్ని వీడియో ప్లే చేసి మరీ చూపించారు వైఎస్ జగన్
జూలై 23వ తేదీన టీటీడీ ఈవో ఇలా..
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావులు వేర్వేరు సందర్భాల్లో ఏమి మాట్లాడారో వీడియోలు ప్లే చేసి మరీ చూపించారూ వైఎస్ జగన్. స్వయంగా చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై 23 వ తేదీన ఏం మాట్లాడారో వీడియో ముఖంగా చూపించారు వైఎస్ జగన్
ఆ నెయ్యి వాడలేదని ఈవోనే రిపోర్ట్ ఇచ్చాడు..
మళ్లీ సెప్టెంబర్ 20వ తేదీన టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ముఖంగా మాట్లాడుతూ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదంటూ ధృవీకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు వైఎస్ జగన్. 22వ తేదీన తాను సంతకం చేసి మరీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ఈవో శ్యామలరావు. ల్యాబ్ టెస్టులో ఫెయిలైన నెయ్యిని వాడలేదని, సదరు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపామని ఈవో తన రిపోర్ట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment