
తిరుపతి: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పిచ్చి ప్రేలాపనలు పేలిన చంద్రబాబు.. తిరుమలను రాజకీయాలకు వేదికగా ఎలా మార్చారో ఆధారాలతో సహా బయటపడ్డాయి. డిక్లరేషన్ పేరుతో దేవదేవుడి సన్నిధిలో నీచ రాజకీయానికి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో జరిగిన దుర్మార్గాలు, వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివద్ధిని పరిశీలిస్తే..
తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను చంద్రబాబు కూల్చివేస్తే.. ఆయన కూల్చేసిన 30 ఆలయాలను వైఎస్ జగన్ పునర్నిర్మించారు. ధూప దీప నైవేద్యాల కింద 5,338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం అందించారు. 2,635 నూతన ఆలయాల నిర్మాణంతో పాటు మరో 300 ఆలయాల జీర్ణోద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు మరో అబద్ధం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్
శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగనే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మఠాధిపతులు, ఆగమ పండితులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగనే.

Comments
Please login to add a commentAdd a comment