
సాక్షి, తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు చంద్రబాబు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్‌సీపీ షేర్ చేసింది.
చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!.
వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన @ncbn.. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు
దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!#CBNShouldApologizeHindus#SatyamevaJayate#TirupatiLaddu#CBNDestroyedAPin100Days pic.twitter.com/YZuC5A79eN— YSR Congress Party (@YSRCParty) October 5, 2024
ఇదే సమయంలో లడ్డూ విషయంలో డైవర్షన్ రాజకీయాలను ప్రశ్నించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు.. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే. లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన పద్ధతి ఇదే. వీటికి సమాధానాలు చెప్పకుండా.. ఈ డైవర్షన్లు ఎందుకు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కనీసం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లకైనా సమాధానం చెప్పు.
1.లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిస్తే.. ఆధారాలెక్కడ?
2.కల్తీ జరిగిందని అనుకున్నప్పుడు లడ్డూలపై ఎందుకు పరీక్షలు చేయించలేదు?
3.ఈవో ఒకమాట, సీఎం ఒక మాట ఎందుకు చెప్పారు? ఆరోపణలున్న నెయ్యిని తిప్పిపంపామని ఈవో, లేదు వాడారని సీఎం… పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు?
4.ఎలాంటి ఆధారం లేకుండా భక్తుల మనోభావాలను చంద్రబాబు ఎందుకు దెబ్బతీశారు?
5.జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 18వరకూ 54 రోజులపాటు ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు.
6.అసలు నెయ్యి సరఫరా జరిగింది ఎప్పుడు? చంద్రబాబు పరిపాలనలో కాదా?
7.శాంపిళ్లు తీసిన జులై 6, జులై 12 తేదీల్లో నడుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? టీటీడీలో ఉన్నది చంద్రబాబు వేసిన ఈవోనే కదా?.