తిరుమల లడ్డూపై 30న సుప్రీంలో విచారణ | Supreme Court To Hear The Case On Tirumala Laddu Controversy On 30th September, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై 30న సుప్రీంలో విచారణ

Published Sun, Sep 29 2024 5:47 AM | Last Updated on Sun, Sep 29 2024 5:13 PM

Supreme court to hear the case on tirumala laddu controversy on 30th September

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్ట­నుంది. లడ్డూలలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంపై యావత్‌ ప్రజానీకం నివ్వెరపోయింది. ఈ వ్యవహా­రంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణియన్‌ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై ఈ నెల 30న విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, కేవీ విశ్వనాథన్‌ బెంచ్‌ లడ్డూ వివాదంపై విచారణ జరపనున్నారు. చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ స్వార్థం, స్వలాభం కోసం వాడు­కునే అవకాశం ఉందనే తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు సుబ్రమణియన్‌­స్వామి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement