చివరి వరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతా
- గాలి వార్తలు నమ్మకండి
- జగనన్న బాటలో నడుస్తా
- నగరి ఎమ్మెల్యే రోజా
పుత్తూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతానని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురా లు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ఆదివారం తొలిసారిగా పుత్తూరు పట్టణంలోని పీఆర్ అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడారు.
ఇటీవల కొన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో తాను పార్టీ వీడనున్నట్టు గాలి వార్తలు వచ్చాయన్నారు. పదవుల కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నా రు. వైఎస్సార్ సీపీలో స్థానం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డితోనే కడవరకు ఉం టానని తెలిపారు.
నగరి అసెంబ్లీ స్థానం నుంచి తనను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీకి చెందిన సీనియర్ నేత లు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు చెప్పారు. తన గెలుపు కోసం కృషి చేసిన వైఎస్సా ర్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అభివృద్ధిపరమైన అంశాలకు సంబంధించిన నిధులు ఆపడానికి వీలుండదని, ఆ విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావడంలో వెనుకాడే ప్రసక్తే లేదని ఆమె పేర్కొన్నారు.
వడమాలపేట ఎంపీపీగా మురళీధర్‌రెడ్డి
వడమాలపేట ఎంపీపీగా వైఎస్సార్ సీ పీ నుంచి పత్తి పుత్తూరు ఎంపీటీసీగా గెలుపొందిన ఎం.మురళీధర్‌రెడ్డి పేరు ను ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా ప్రకటించారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీకి చెం దిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఒక్కటిగా ఉన్నారన్నారు. పార్టీలు మారే పరి స్థితి లేదన్నారు. ఆరుగురు ఎంపీటీసీలు ఇక్కడే ఉన్నారంటూ మీడియా ముందు వారిని పరిచయం చేశారు.
వార్తా కథనాలు రాసేటపుడు తన వివరణ తీసుకోవాలని, కనీసం ఫోన్ ద్వారానైనా సంప్రదించాలని సూచించారు. సమావేశంలో వడమాలపేట మండలానికి చెందిన వై ఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు లలి త (అప్పలాయగుంట), శకుంతల (పూ డి), ఎం.జ్యోతి(ఎస్బీఆర్ పురం), రంగనాథం(శీతారామపురం), సుబ్బలక్ష్ము మ్మ(ఎఎంపురం), మురళీధర్‌రెడ్డి (పత్తిపుత్తూరు)తో పాటు జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌కుమార్, సింగిల్‌విండో మాజీ అ ధ్యక్షుడు చెంగల్రాజు, ఏఎంపురం స ర్పంచ్ వెంకటరత్నం, నాయకులు చం ద్రశేఖర్‌రాజు, తులసీరామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, ఉమాపతి, మహేష్‌రెడ్డి, సుబ్రమణ్యంరాజు, పుత్తూరు నాయకులు ఏలుమలై (అమ్ములు), ఎన్‌ఏ.గణేష్, జనార్థన్‌యాదవ్, లారీ మోహన్ పాల్గొన్నారు.